
సాక్షి, విజయవాడ : విజయవాడలో దారుణ హత్యకు గురైన చిన్నారి ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నల్లకుంట గ్రామానికి తరలించారు. పోస్టుమార్టం మొత్తాన్ని డాక్టర్లు వీడియోల ద్వారా రికార్డు చేసి భద్రపరిచారు. ఈ నేపథ్యంలో ద్వారక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రకాశ్‌తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్‌లో సాగిన సంభాషనే విచారణలో కీలకం కానుంది. బాలిక తల్లికి అతను చాలా సార్లు ఫోన్ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిన్నారి ద్వారకను తానే హత్య చేసినట్లు నిందితుడు ప్రకాశ్ ఇదివరకే అంగీకరించిన విషయం తెలిసిందే.