ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం | Dwarka Shankaracharya Swami Swaroopanand Saraswati Passes Away | Sakshi
Sakshi News home page

ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం.. మోదీ, షా విచారం

Published Mon, Sep 12 2022 7:01 AM | Last Updated on Mon, Sep 12 2022 7:01 AM

Dwarka Shankaracharya Swami Swaroopanand Saraswati Passes Away - Sakshi

తొమ్మిదేళ్ల వయసులో ఇల్లు వీడి.. స్వాతంత్య్ర సమయంలో జైలు జీవితం గడిపిన ద్వారకా పీఠాధిపతి స్వామి శంకరాచార్య స్వరూపానంద..

భోపాల్‌: ద్వారకా పీఠాధిపతి స్వామి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి (99) ఆదివారం శివైక్యం పొందారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని ఆశ్రమంలో మధ్యాహ్నం 3.30 గంటలకు స్వరూపానంద సరస్వతి తుది శ్వాస విడిచినట్టు ఆయన ముఖ్య అనుచరుడైన స్వామి సదానంద మహరాజ్‌ తెలిపారు.  ద్వారక, శారద, జ్యోతిష్‌ పీఠాలకు శంకరాచార్యుడిగా ఉన్న స్వామి స్వరూపానంద ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లా డిఘోరిలో 1924లో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులో ఇల్లు వీడారు. స్వాతంత్య్ర సమయంలో జైలు జీవితం గడిపారు. 1981లో ద్వారకపీఠాధిపతి అయ్యారు. స్వరూపనంద శివైక్యం చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం​ మంత్రి అమిత్‌ షా ట్విటర్‌ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement