peetadhipathi
-
విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన వైవీ సుబ్బారెడ్డి
-
హతి రాంజీ మఠం అర్జున్ దాస్ ను పీఠాధిపతిగా తొలగింపు
-
ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం
భోపాల్: ద్వారకా పీఠాధిపతి స్వామి శంకరాచార్య స్వరూపానంద సరస్వతి (99) ఆదివారం శివైక్యం పొందారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లోని ఆశ్రమంలో మధ్యాహ్నం 3.30 గంటలకు స్వరూపానంద సరస్వతి తుది శ్వాస విడిచినట్టు ఆయన ముఖ్య అనుచరుడైన స్వామి సదానంద మహరాజ్ తెలిపారు. ద్వారక, శారద, జ్యోతిష్ పీఠాలకు శంకరాచార్యుడిగా ఉన్న స్వామి స్వరూపానంద ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లా డిఘోరిలో 1924లో జన్మించారు. తొమ్మిదేళ్ల వయసులో ఇల్లు వీడారు. స్వాతంత్య్ర సమయంలో జైలు జీవితం గడిపారు. 1981లో ద్వారకపీఠాధిపతి అయ్యారు. స్వరూపనంద శివైక్యం చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ట్విటర్ ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन से अत्यंत दुख हुआ है। शोक के इस समय में उनके अनुयायियों के प्रति मेरी संवेदनाएं। ओम शांति! — Narendra Modi (@narendramodi) September 11, 2022 द्वारका शारदा पीठ के शंकराचार्य स्वामी स्वरूपानंद सरस्वती जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। सनातन संस्कृति व धर्म के प्रचार-प्रसार को समर्पित उनके कार्य सदैव याद किए जाएँगे। उनके अनुयायियों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर दिवंगत आत्मा को सद्गति प्रदान करें। ॐ शांति pic.twitter.com/uPnv3JEull — Amit Shah (@AmitShah) September 11, 2022 -
పీఠాధిపతి నియామకాన్ని 2 నెలల్లో పూర్తిచేయండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా, కందిమల్లయ్య పల్లె గ్రామంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి కన్నుమూసిన నేపథ్యంలో పీఠాధిపతి నియామకాన్ని రెండు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు గురువారం ఏపీ ధార్మిక పరిషత్‌ను ఆదేశించింది. ఇరుపక్షాల వాదనలు విని పీఠాధిపతి నియామకం చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయ శాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ, కుమారుడు ఎన్.గోవిందస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమను పీఠాధిపతులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా దేవదాయ శాఖాధికారులు జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దుచేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. మఠం పీఠాధిపతిని తాత్కాలికంగా నియమించే అధికారం ధార్మిక పరిషత్‌కు ఉందని స్పష్టంచేశారు. మఠాధిపతులుగా తమను నియమించాలన్న అభ్యర్థనను సింగిల్ జడ్జి పట్టించుకోలేదంటూ గోవిందస్వామి, మారుతి మహాలక్షుమ్మ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం తీర్పునిచ్చిన ధర్మాసనం.. ఇరుపక్షాల వాదనలు విని రెండునెలల్లో మఠం పీఠాధిపతి నియామకాన్ని పూర్తిచేయాలని ధార్మిక పరిషత్‌ను ఆదేశించింది. -
మమ్మల్ని పీఠాధిపతులుగా గుర్తించేలా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా కందిమల్లయ్యపల్లె గ్రామంలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమఠం పీఠాధిపత్య వివాదం హైకోర్టుకు చేరింది. మఠం శాశ్వత పీఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత పీఠాధిపతి కుమారుడు ఎన్.గోవిందస్వామి, రెండో భార్య మారుతి మహాలక్ష్మి హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది. మఠం ప్రైవేటు ఆస్తి అని, అందువల్ల మఠం వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. మఠం వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం మాత్రమే అధికారులకు ఉంది తప్ప, మఠం నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి లేదని తెలిపారు. 1965లోనే కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. పీఠాధిపతి మొదటి భార్య కుమారుడైన వెంకటాద్రిస్వామికి పీఠాధిపత్యం వహించే అర్హత లేదన్నారు. ఆయన న్యాయవాదిగా కడపలో ప్రాక్టీస్ చేస్తున్నారని, ఎన్నడూ మఠంలో పూజాదికాలు నిర్వహించలేదని తెలిపారు. పెద్ద కుమారుడే పీఠాధిపత్యం వహించాలన్న ఆచారం ఏమీ లేదన్నారు. 2008లో పీఠాధిపతి రాసిన వీలునామా ప్రకారం మొదటి భార్య సంతానానికి మఠం వ్యవహారాలపై ఆసక్తి లేదని, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియదని పేర్కొన్నారు. తన కుమారుడు మైనర్ కాబట్టి అతను మేజర్ అయ్యేంతవరకు తాత్కాలికంగా పీఠాధిపత్యం వహించే అధికారం తనకు ఉందని మహాలక్ష్మి పేర్కొన్నారు. -
బ్రహ్మంగారి మఠంపై తేలని నిర్ణయం
బ్రహ్మంగారిమఠం/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్ జిల్లాలోని శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన పీఠాధిపతి నియామకం విషయమై కుటుంబసభ్యుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఫలించలేదు. చర్చలకు సంబంధించిన వివరాలను శివైక్యం చెందిన పీఠాధిపతి వీరభోగ వసంతవేంకటేశ్వరస్వామి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి ‘సాక్షి’కి వివరించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు తమ పినతల్లితో తాను, తన సోదరులు పీఠాధిపత్యంపై మాట్లాడినట్లు చెప్పారు. తమ పినతల్లి మారుతీ మహాలక్షుమ్మ మాత్రం పీఠాధిపత్యం ఆమెకే కావాలని తేల్చిచెప్పారన్నారు. ఒకవేళ లేదంటే పెద్దభార్య రెండో కుమారుడు వీరభద్రయ్యకు అప్పజెప్పాలని సూచించారన్నారు. పెద్దకుమారుడినైన తనకు కావాలంటే బ్రహ్మంగారి గురించి ప్రచారం చేసేందుకు అనుమతి కల్పిస్తామని చెప్పారన్నారు. ‘ఇంతకుముందు మీ పెద్దకుమారుడికి పీఠాధిపత్యం కావాలన్నారు. ఇప్పుడేమో తెరపైకి మా రెండో తమ్ముడి పేరు ప్రతిపాదిస్తున్నారు. అసలు పీఠాధిపతి కుమారులు అనర్హులు అయినందువల్లే.. పీఠాధిపతి రెండో వివాహం చేసుకున్నారు. తన పిల్లలకు మాత్రమే పీఠాధిపత్యం కావాలని వీలునామా కూడా రాశారు అని గతంలో చెప్పారు కదా..’ అని తమ పినతల్లిని అడిగినట్లు తెలిపారు. దీనిపై తమ పినతల్లి స్పందిస్తూ ‘అది అప్పటిమాట. ఇప్పుడు నాకు రాకపోయినా వీరభద్రయ్యకు రావాలి’ అని చెప్పారన్నారు. లేనిపక్షంలో కోర్టునైనా ఆశ్రయిస్తానని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. తాను మాత్రం దేవదాయశాఖ ఆదేశాల మేరకు నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయాన్ని అమలు చేయాలని సూచించాం: శివస్వామి బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వ్యవహారంలో సంప్రదాయాలను, హిందూధర్మాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు సూచించినట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిసిన శివస్వామి మఠం పీఠాధిపతి వ్యవహారంపై రెండో నివేదికను అందజేశారు. అనంతరం శివస్వామి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మంగారి వారసులు, పలు పీఠాధిపతులు, విశ్వబ్రాహ్మణ సంఘాల వారు, కందిమల్లయ్యపల్లి గ్రామస్తులు, ఉపమఠాల వారి అభిప్రాయాలు, సూచనలతో విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక పక్షాన మంత్రికి రెండో నివేదికను ఇచ్చినట్లు తెలిపారు. హిందూధర్మం, శాస్త్రాలు, పెద్దల మనోభావాల మేరకు పెద్ద కుమారుడికే పీఠాధిపత్యం దక్కాలని సూచించామన్నారు. త్వరలోనే ఈ వివాదాన్ని పరిష్కరిస్తామని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారన్నారు. -
వీడని ‘పీఠ’ముడి!
బ్రహ్మంగారి మఠం: తన కాలజ్ఞానం ద్వారా ప్రపంచానికి భవిష్యత్తును చాటిచెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యంపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ఆధిపత్యం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. తాజా పరిస్థితులు పరిశీలిస్తే ఈ వివాదం పరిష్కారానికి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం నెరపుతున్న గుంటూరు జిల్లాకు చెందిన పీఠాధిపతి శివస్వామి నేతృత్వంలోని ఇతర మఠాధిపతుల బృందం ఆదివారం మఠానికి వచ్చి రెండోసారి చర్చలు జరుపుతారని.. తద్వారా వివాదానికి ముగింపు పలికే అవకాశముందని అందరూ భావిస్తున్నారు. కానీ.. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్షుమ్మ మాత్రం పట్టువదలకపోవడంతో ఇప్పుడు ఈ వివాదంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యవర్తిత్వానికి ‘నో’.. మఠాధిపతి వివాదంలో అసాంఘిక శక్తులు వచ్చే అవకాశముందని, పీఠాధిపతుల జోక్యాన్ని సహించేదిలేదని, వీరిని మఠానికి రాకుండా నిలువరించాలంటూ డీజీపీ మొదలుకుని కిందిస్థాయి అధికారులందరికీ ఆమె శుక్రవారం లేఖలు రాశారు. అలాగే, తాము మఠాధిపతుల చర్చల్లో పాల్గొనేది కూడా లేదని ఆమె స్పష్టంచేశారు. తాము దేవదాయ శాఖ నిబంధనల మేరకు మఠం పర్యవేక్షణలోనే మఠాధిపతి ఎంపిక నిర్వహించుకుంటామని, పీఠాధిపతుల జోక్యం అక్కర్లేదని ఆమె తెగేసి చెబుతున్నారు. అలాగే, మఠాధిపతి నియామకం వారసత్వ చట్ట ప్రకారం ఉంటుందని దివంగత మఠాధిపతి మొదటి భార్య కుమారులు అంటున్నారు. ఈ విషయంపై శివస్వామి ఈనెల 2న వివిధ పీఠాధిపతులతో కలిసి ఇరువర్గాలతో చర్చలు జరిపినప్పటికీ వివాదం ఓ కొలిక్కి రాని విషయం తెలిసిందే. రెండోదఫా చర్చలు ప్రశ్నార్ధకం మరోవైపు.. శివస్వామి నేతృత్వంలోని పీఠాధిపతుల బృందం బ్రహ్మంగారి మఠానికి శనివారం రాత్రి రానుండడంతో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. పీఠాధిపతుల నేతృత్వంలో చర్చలకు మహాలకు‡్ష్మమ్మ ససేమిరా అనడంతో రెండవ దఫా చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో పోలీసులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో ఈ విషయమై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అనంతరం.. దేవదాయ శాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం. రాజీ ఫార్ములా!? ఇదిలా ఉంటే.. స్థానిక ప్రజల్లో కొందరు దివంగత మఠాధిపతి మొదటి భార్య తనయుడికి మద్దతు పలుకుతుండగా, మరికొందరు రెండో భార్యకు అండగా నిలుస్తుండడంతో ఈ వివాదంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే, పీఠాధిపతులు వారి కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రెండు, మూడు రకాల ప్రతిపాదనలు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇది విఫలమైన పక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. పీఠాధిపతులకు అనుమతిలేదు బి.మఠం మఠాధిపతి నియామకం కోసం చర్చల నిమిత్తం వస్తున్న వివిధ పీఠాధిపతులకు దేవస్థానంలోకి అనుమతిలేదు. వారు శనివారం రాత్రికి వస్తే వారు బి.మఠంలోని పల్నాటి అన్నదాన సత్రంలో ఉండేందుకు ఏర్పాట్లుచేశారు. పీఠాధిపతులు ఆదివారం కేవలం స్వామి దర్శనం కోసం వెళ్లొచ్చు కానీ చర్చలకు మాత్రం అందరి ఆమోదం ఉంటేనే పంపుతాం. –విజయకుమార్, మైదుకూరు డీఎస్పీ ఇదీ వివాదం.. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందారు. భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. చంద్రావతి అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు. వీరు మైనర్లు. మఠాధిపతి వెంకటేశ్వరస్వామి మరణంతో పెద్ద భార్య జ్యేష్ఠ కుమారుడు వెంకటాద్రిస్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య ఇప్పుడు పీఠాధిపత్యంపై పోటీ నెలకొంది. అయితే, గోవిందస్వామి మేజర్ అయ్యే వరకు తాను మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి పలువురు పీఠాధిపతులు గత వారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. కానీ, వీరి ప్రయత్నాలు ఫలించలేదు. -
కమలాపురం పీఠాధిపతి కన్నుమూత
కమలాపురంలోని హజరత్ అబ్దుల్ గప్ఫార్ షా ఖాద్రి దర్గా పీఠాధిపతి హజ రత్ హాజీ జహీరుద్దీన్ షా ఖాద్రి(69) కన్నుమూశారు. కొంతకాలంగా మల్టీపుల్ ఆర్గాన్స ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరకు గురువారం ఉదయం 11 గంటలకు తుది శ్వాస వది లారు. హైపర్ టెన్షన్, న్యూమోనియో, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా ఆయన ఈ నెల 14న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు డాక్టర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలో చికిత్సలు అందించారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు పీఠాధిపతి లోకం నుంచి నిష్ర్కమించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. రాష్ర్ట నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని ఆయన శిష్యులు విషాద వదనంతో ఉండిపోయారు. ఇప్పటికే ఆయన శిష్యులు ఒక్కొక్కరుగా దర్గా చేరుకుంటున్నారు. మహిమలతో పెరిగిన శిష్యరికం పెద్ద దర్గా పీఠాధిపతి హాజీ హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి తన దివ్య మహిమలతో రాష్ట్రం నలుమూలలే గాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లోనూ అధిక సంఖ్యలో శిష్యగణాన్ని ఏర్పరచుకున్నారు. తన తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఖిలాఫత్ చేయడం ప్రారంభించారు. పదహారో ఏట తండ్రి మరణంతో 1960 నుంచి ఇప్పటి వరకు ఆయన దర్గాకు పీఠాధిపతిగా కొనసాగారు. ఏటా ఏప్రిల్‌లో ఆయన ఆధ్వర్యంలో ఉరుసు ఉత్సవాలను నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. భౌతికకాయాన్ని సందర్శించిన వైఎస్ జగన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రీ భౌతికకాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన భౌతికకాయాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. పెద్ద దర్గా పీఠాధిపతి హాజీ హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రి అంత్యక్రియలు శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం నిర్వహించనున్నట్లు స్వామి కుటుంబ సభ్యులు తెలిపారు. భక్తులు, శిష్యులు హాజరు కావాలని వారు కోరారు. స్వామి ఆశీస్సుల కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఇక్కడి దర్గా పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రి వద్దకు వచ్చి ఆశీర్వాదం పొందేవారు. ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్ల ప్రక్రియకు ముందు అభ్యర్థులు స్వామి ఆశీర్వాదం పొందిన తర్వాతనే తమ పనులు మొదలుపెట్టేవారు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరినీ పీఠాధిపతి ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. చిన్న పిల్లలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా తల్లిదండ్రులు వెంటనే ఇక్కడికి వచ్చి స్వామి వారు ఇచ్చే తాయొత్తులను కట్టించుకునేవారు. ఇప్పుడు ఆ స్వామి లేరని తెలసి భక్తులు కన్నీరుమున్నీరయ్యారు. దర్గా ప్రాంగాణానికి చేరుకుని గురువుతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.