Dwarka Expressway Cost 14 Times More Than Approved Amount - Sakshi
Sakshi News home page

Dwarka Expressway: ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్‌ సంచలన వ్యాఖ్యలు

Published Mon, Aug 14 2023 10:14 AM | Last Updated on Mon, Aug 14 2023 10:47 AM

Dwarka Expressway Cost 14 Times More Than Approved Amount - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ–గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం అత్యంత ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తోందని కాగ్‌(కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నివేదిక వ్యాఖ్యానించింది. ఒక్కో కిలోమీటర్‌కు నిర్మాణ వ్యయం ప్రభుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా వాస్తవ ఖర్చు రూ.250.77 కోట్లకు పెరిగిందని తెలిపింది. 

అయితే, భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా ఈ 48వ నంబర్‌ జాతీయ రహదారిని 14 లేన్లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే, 8 లేన్ల ఎలివేటెడ్‌ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ హైవే కారిడార్‌లో వాహనాల రాకపోకలు సులభంగా జరిగేందుకు గాను తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను ఇవ్వడమే నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమని రోడ్డు రవాణా హైవేల శాఖ చెబుతోందని వివరించింది.

ఈ కారణం సహేతుకంగా లేదని కాగ్‌ పేర్కొంది. కేవలం ఆరు లేన్లకు మాత్రమే ప్రణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశారని తెలిపింది. ఇదే కాకుండా, దేశవ్యాప్తంగా భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన హైవేల నిర్మాణంలో కేటాయింపుల కంటే 58% అధికంగా ఖర్చు చేశారని వివరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది.

ఈ నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శులు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఇక, దీనిపై సోషల్‌ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. 

  ఇది కూడా చదవండి: బీజేపీతో పొత్తుపై శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement