Bharatmala
-
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వ్యయంపై కాగ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ–గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం అత్యంత ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తోందని కాగ్(కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వ్యాఖ్యానించింది. ఒక్కో కిలోమీటర్‌కు నిర్మాణ వ్యయం ప్రభుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా వాస్తవ ఖర్చు రూ.250.77 కోట్లకు పెరిగిందని తెలిపింది. అయితే, భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా ఈ 48వ నంబర్ జాతీయ రహదారిని 14 లేన్లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే, 8 లేన్ల ఎలివేటెడ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవే కారిడార్‌లో వాహనాల రాకపోకలు సులభంగా జరిగేందుకు గాను తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఇవ్వడమే నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమని రోడ్డు రవాణా హైవేల శాఖ చెబుతోందని వివరించింది. ఈ కారణం సహేతుకంగా లేదని కాగ్ పేర్కొంది. కేవలం ఆరు లేన్లకు మాత్రమే ప్రణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశారని తెలిపింది. ఇదే కాకుండా, దేశవ్యాప్తంగా భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన హైవేల నిర్మాణంలో కేటాయింపుల కంటే 58% అధికంగా ఖర్చు చేశారని వివరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్ర విమర్శులు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపిస్తున్నారు. ఇక, దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. CAG exposed the scam of 6741 crores in building of Dwarka Expressway. If TV media raise these issues & debate on this, BJP will fall like a pack of cards ♠️ pic.twitter.com/81ohaACopW — Baijuu Nambiar CFP®✋ (@baijunambiar) August 14, 2023 ఇది కూడా చదవండి: బీజేపీతో పొత్తుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు -
ఆరు గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు..
ప్రస్తుతం.. : కర్ణాటక రాజధాని బెంగళూరు – విజయవాడ మధ్య రోడ్డు మార్గం దూరం 560 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 12 గంటలు. అదీ నేరుగా లేదు. వ్యయప్రయాసలతో కూడుకొన్నది. విజయవాడ నుంచి రాయలసీమకు వెళ్లడానికీ సరైన దారి లేదు. మూడేళ్ల తర్వాత : బెంగళూరు నుంచి విజయవాడకు రోడ్డు మార్గం దూరం 342 కిలోమీటర్లు. ప్రయాణ సమయం 6 గంటలే. పైగా, విజయవాడ నుంచి రాయలసీమలోని అనేక ప్రాంతాలకు సౌకర్యవంతమైన రోడ్డు మార్గం. ప్రయాణ సమయం, ఖర్చు కూడా తక్కువ. సాక్షి, అమరావతి: భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బెంగళూరు – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో ఈ కల సాకారమవుతుంది. రూ.19,200 కోట్లతో ఆరు లేన్లుగా 342 కిలోమీటర్ల ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ హైవేకి భూసేకరణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా పూర్తి చేసింది. దాంతో 10 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి, పనులు అప్పగించే చర్యలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) వేగవంతం చేసింది. నాలుగు ప్యాకేజీలకు టెండర్లు పిలిచింది. 2025 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతానికి విజయవాడతో నేరుగా రహదారి లేదు. కర్ణాటకకు కూడా అనుసంధానం సరిగా లేదు. ఈ రెండు ప్రయోజనాలను సాధించాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ హైవేగా బెంగళూరు – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. సీఎం జగన్ సమర్పించిన ప్రతిపాదనలను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు. ప్రస్తుతం బెంగళూరు – విజయవాడ మధ్య దూరభారాన్ని దాదాపు సగానికి తగ్గించేలా రూట్‌మ్యాప్ రూపొందించారు. ఈ హైవే నిర్మాణం పూర్తయితే ఆరు గంటల్లోనే బెంగళూరు చేరుకోవచ్చు. సరుకు రవాణా కూడా మరింతగా పెరుగుతుంది. ఇదీ రూట్.. కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు నుంచి ఈ హైవే ప్రారంభమవుతుంది. మన రాష్ట్రంలో పుట్టపర్తి జిల్లాలోని కందికొండ, వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, నెల్లూరు జిల్లా మల్లెపల్లి, వంగపాడు, ప్రకాశం జిల్లా అద్దంకి మీదుగా మేదరమెట్ల వరకు వస్తుంది. అక్కడ జాతీయ రహదారి–16కు అనుసంధానిస్తారు. ఇది నేరుగా విజయవాడను కలుపుతుంది. -
ఏపీలో రెండు రహదారులకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: భారతమాల పరియోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాజెక్టులకు పాలనాపరమైన ఆమోదం లభించిందని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.909.47 కోట్లతో చిల్లకూరు క్రాస్ రోడ్ నుంచి తూర్పు కనుపూరు వరకు మొత్తం 36.05 కి.మీ పొడవుతో నాలుగు లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణం జరగనుంది. అలాగే, రూ.1,398.84 కోట్లతో నాయుడుపేట (గ్రీన్‌ఫీల్డ్స్) నుంచి తూర్పు కనుపూరు వరకు మొత్తం 34.881 కి.మీ పొడవుతో ఆరులేన్ల నిర్మాణం జరుగుతుందని కేంద్రమంత్రి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. (క్లిక్: రవాణా ఆదాయం రయ్) -
భారత్ మాల @ రూ.10.63 లక్షల కోట్లు
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌మాలా (జాతీయ రహదారుల విస్తరణ) ప్రాజెక్టు తీవ్ర జాప్యాన్ని చూస్తోంది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 23 శాతం పనులే కాగా, 2028 మార్చి నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వాస్తవానికి 2022 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించగా సాధ్యపడలేదు. ఆరేళ్లు ఆలస్యంగా, అది కూడా ముందు అంచనాలకు రెట్టింపు వెచ్చిస్తే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. అది కూడా ప్రస్తుత ధరల ప్రకారమే వ్యయాలు రెట్టింపు అవుతాయన్నది అంచనా. భూముల ధరలు, ఇన్పుట్ వ్యయాలను కూడా కలిపి చూస్తే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మరో 15–20 శాతం మేర వ్యయాలు పెరిగిపోవచ్చని ఇక్రా తన నివేదికలో తెలిపింది. భూ సమీకరణ పెద్ద సమస్యగా మారిందని పేర్కొంది. ప్రాజెక్టులో 60 శాతానికే అవార్డ్ భారత్‌మాలా ప్రాజెక్ట్ మొత్తం విస్తీర్ణం 34,800 కిలోమీటర్లు కాగా, ఇందులో 60 శాతానికే అంటే 20,632 కోట్ల మేర రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆర్డర్లు (2021 డిసెంబర్ నాటికి) ఇచ్చింది. భూ సమీకరణలో సమస్యలు, భూముల కొనుగోలు వ్యయాలు గణనీయంగా పెరిగిపోవడం, కరోనా మహమ్మారిని ప్రాజెక్టు జాప్యానికి కారణాలుగా ఇక్రా తెలియజేసింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) అదనపు రుణాల సమీకరణను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. రహదారుల నిర్మాణానికి క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయిస్తామని, చిన్న ఇన్వెస్టర్లకు 8 శాతం వడ్డీని ఆఫర్ చేసి తగినన్ని నిధులను సమీకరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ గతవారమే ప్రకటించడం గమనార్హం. భారత్‌మాలా కింద పూర్తి విస్తీర్ణం మేరకు రహదారుల నిర్మాణ అవార్డులను జారీ చేయడం 2024 మార్చి నాటికి పూర్తవుతుందని ఇక్రా అంచాన వేస్తోంది. ఎన్నికల కారణంగా జాప్యం చోటు చేసుకుంటే ఇది 2025 మార్చి వరకు పట్టొచ్చని తెలిపింది. ఏటా 4,500–5,000 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగితే 2028 మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంది. -
ఎన్హెచ్ఏఐ ఒక "బంగారు గని": నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: 2019లో ప్రారంభమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభమైన(2023) నాటి నుంచి కేంద్రానికి ప్రతి నెలా ₹1,000 నుంచి ₹1500 కోట్ల విలువైన టోల్ ఆదాయం వస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్హెచ్ఏఐని ఆదాయాన్ని ఉత్పత్తి చేసే "బంగారు గని"గా అభివర్ణించారు. నాలుగు రాష్ట్రాల గుండా వెళ్లే ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతిని తెలుసుకోవడానికి గడ్కరీ సుడిగాలి పర్యటన చేశారు. జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే మార్చి 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు 'భారత్ మాల పరియోజన' మొదటి దశలో భాగంగా నిర్మిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల గుండా వెళ్లే ఎనిమిది లైన్ల ఎక్స్ ప్రెస్ వే. ఈ హైవే ప్రారంభమైన తర్వాత దేశ రాజధాని, దేశ ఆర్థిక కేంద్రం మధ్య ప్రయాణ సమయం దాదాపు 24 గంటల నుండి 12 గంటలకు తగ్గనుంది.(చదవండి: ఐఫోన్ 13.. భారత్‌లో మరీ అంత రేట్లా?) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రస్తుత స్థాయి ₹40,000 కోట్ల నుంచి రాబోయే ఐదేళ్లలో ₹1,40,000 లక్షల కోట్ల వార్షిక టోల్ ఆదాయాన్ని వసూలు చేస్తుందని నమ్మకంగా గడ్కరీ నొక్కి చెప్పారు. ఎన్హెచ్ఏఐ ఎక్కువ రుణభారంతో సతమతం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నోడల్ ఏజెన్సీకి 'ఏఏఏ' రేటింగ్ లభించిందని, 'ఏఏఏ' అనేది అత్యధిక క్రెడిట్ రేటింగ్ బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. 2017 మార్చిలో ₹ 74,742 కోట్ల ఉన్న మొత్తం రుణాలు ఈ ఏడాది మార్చి చివరినాటికి ₹ 3,06,704 కోట్లకు పెరిగాయని ఇటీవల మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు ఉపాధిని సృష్టిస్తాయని మరియు దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయనీ పేర్కొన్న గడ్కరీ. -
భారత్‌మాల : ఏపీకి 3, తెలంగాణకు 2
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రహదారుల, మౌలిక వసతుల అబివృద్ధికి భారత్ ఒకసాక్షిలా మారనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశంలో నిర్మిస్తున్న ఆరు జాతీయ రహదారులే కాకుండా.. భారత్‌మాల ప్రాజెక్టు కింద మరో 44 ఎకనమిక్ కారిడార్ల అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు.. చెరో రెండు కారిడార్లను కేంద్రం ప్రకటించింది. భారత్ మాల ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది డిసెంబర్లో మొదలవుతాయని కేంద్రమంత్రి గడ్కరీ సూచనప్రాయంగా తెలిపారు. భారత్ మాల ప్రాజెక్టు కింద మొత్తం 44 ఎకనమిక్ కారిడార్లు, 65 ఇంటర్ కారిడార్లు, 115 ఫీడర్ కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తారు. ఇదే విషయాన్ని గడ్కిరీ తన ట్విటర్లో ప్రకటించారు. మొత్తం 7 లక్షల కోట్లతో కేంద్ర ప్రబుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రహదారులను నిర్మిస్తోంది. భారతదేశ మౌలిక వసతుల కల్పనలో ఇదొక సువర్ణ అధ్యాయమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లు ఇవే: 1. ముంబై-కోల్‌కతా 2. ముంబై-కన్యాకుమారి 3. అమృత్సర్-జామ్‌నగర్ 4. కాండ్లా-సాగర్ 5. ఆగ్రా - ముంబై 6. పూణె- విజయవాడ 7. రాయ్‌పూర్-ధన్‌బాద్ 8. లూథియానా-అజ్మీర్ 9. సూరత్ - నాగ్‌పూర్ 10. హైదరాబాద్ - పనాజీ 11. జైపూర్ - ఇండోర్ 12. షోలాపూర్ - నాగ్‌పూర్ 13. సాగర్ -వారణాసి 14. ఖరగ్‌పూర్ - సిలిగురి 15. రాయ్‌పూర్ - విశాఖపట్నం 16. ఢిల్లీ - లక్నో 17. చెన్నై - కర్నూల్ 18. ఇండోర్ - నాగ్‌పూర్ 19. చెన్నై- మధురై 20. మంగళూరు - రాయ్‌చూర్ 21. ట్యుటికోరిన్ - కొచ్చిన్ 22. షోలాపూర్ - బళ్లారి 23. హైదరాబాద్ - ఔరంగాబాద్ 24. ఢిల్లీ - కాన్పూర్ 25. సాగర్ - లక్నో 26. సంభల్పూర్ - రాంచీ జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా.. బారత్మాల ప్రాజెక్టుకు మంగళవారంకేంద్రం ప్రభుత్వం ఆమెద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 83,677 కిలోమీటర్ల రహదారిని రూ.7 లక్షల కోట్లతో కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. భారత్‌మాల ప్రాజెక్టు వల్ల కోటి ఉద్యోగల సృష్టి జరుగుతుందని మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. భారత్ రహదారులు అమెరికా, జర్మనీల స్థాయికి చేరుతాయని ఆయన స్పష్టం చేశారు. BharatMala program includes development of 44 Economic Corridors, 66 Inter Corridor Routes & 116 Feeder Routes pic.twitter.com/fMBlHyUWuj — Nitin Gadkari (@nitin_gadkari) October 25, 2017 -
భారీ నిధులతో భారత్‌మాల
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ 3.5 లక్షల కోట్లతో 40,000 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి, విస్తరణ కోసం భారత్‌మాల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.2022 నాటికి ఈ బృహత్తర ప్రాజెక్టు పూర్తిచేసేలా రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. భారత్‌మాల ప్రాజెక్టులో సరిహద్దు ప్రాంతాలను కనెక్ట్ చేయడం, అంతర్జాతీయ పోర్టులు, కోస్తా తీరాలకు కనెక్టివిటీ, ఆర్థిక, వాణిజ్య హబ్‌లను కలుపుతూ హైవే కారిడార్లను అభివృద్ధి చేయడాన్ని ప్రణాళికాబద్ధంగా చేపడతారు. భారత్‌మాల ప్రాజెక్టు కింద ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు 2022 నాటికి దేశవ్యాప్తంగా 32 కోట్ల శ్రామిక పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. కీలక రహదారుల్లో ట్రాఫిక్ కదలికలను వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది.ఇక ప్రభుత్వ అంచనా మేరకు 10,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తే ఏటా నాలుగు కోట్ల శ్రామిక పనిదినాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఉద్యోగావకాశాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలనూ ఈ ప్రాజెక్టు ద్వారా తిప్పికొట్టాలని కూడా మోదీ సర్కార్ యోచిస్తోంది. మరోవైపు రానున్న ఐదేళ్లలో రూ 6.9 లక్షల కోట్లతో 83వేల కిమీ రోడ్లను అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక మెగా హైవే ప్లాన్‌కూ కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.