సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ 3.5 లక్షల కోట్లతో 40,000 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి, విస్తరణ కోసం భారత్‌మాల ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.2022 నాటికి ఈ బృహత్తర ప్రాజెక్టు పూర్తిచేసేలా రోడ్‌మ్యాప్‌ను రూపొందించారు. భారత్‌మాల ప్రాజెక్టులో సరిహద్దు ప్రాంతాలను కనెక్ట్ చేయడం, అంతర్జాతీయ పోర్టులు, కోస్తా తీరాలకు కనెక్టివిటీ, ఆర్థిక, వాణిజ్య హబ్‌లను కలుపుతూ హైవే కారిడార్‌లను అభివృద్ధి చేయడాన్ని ప్రణాళికాబద్ధంగా చేపడతారు.
భారత్‌మాల ప్రాజెక్టు కింద ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు 2022 నాటికి దేశవ్యాప్తంగా 32 కోట్ల శ్రామిక పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. కీలక రహదారుల్లో ట్రాఫిక్ కదలికలను వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది.ఇక ప్రభుత్వ అంచనా మేరకు 10,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తే ఏటా నాలుగు కోట్ల శ్రామిక పనిదినాలు అందుబాటులోకి వస్తాయి.
దేశంలో ఉద్యోగావకాశాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలనూ ఈ ప్రాజెక్టు ద్వారా తిప్పికొట్టాలని కూడా మోదీ సర్కార్ యోచిస్తోంది. మరోవైపు రానున్న ఐదేళ్లలో రూ 6.9 లక్షల కోట్లతో 83వేల కిమీ రోడ్లను అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక మెగా హైవే ప్లాన్‌కూ కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment