
సాక్షి, న్యూఢిల్లీ: భారతమాల పరియోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాజెక్టులకు పాలనాపరమైన ఆమోదం లభించిందని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.909.47 కోట్లతో చిల్లకూరు క్రాస్ రోడ్ నుంచి తూర్పు కనుపూరు వరకు మొత్తం 36.05 కి.మీ పొడవుతో నాలుగు లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణం జరగనుంది.
అలాగే, రూ.1,398.84 కోట్లతో నాయుడుపేట (గ్రీన్‌ఫీల్డ్స్) నుంచి తూర్పు కనుపూరు వరకు మొత్తం 34.881 కి.మీ పొడవుతో ఆరులేన్ల నిర్మాణం జరుగుతుందని కేంద్రమంత్రి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. (క్లిక్: రవాణా ఆదాయం రయ్)
Comments
Please login to add a commentAdd a comment