high ways
-
వాహనదారులకు షాక్.. పెరగనున్న టోల్ చార్జీలు!
హైవేలపై ప్రయాణించే వాహదారులకు టోల్ బాదుడు మరింత పెరగనుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హోచ్‌ఏఐ) ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ రేట్లను పెంచే అవకాశం ఉందని హిందీ దినపత్రిక హిందూస్థాన్ ప్రచురించింది. దీని ప్రకారం.. టోల్ రేట్లు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది. జాతీయ రహదారుల రుసుము నియమావళి-2008 ప్రకారం.. సాధారణంగా ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త టోల్ చార్జీ రేట్లు అమలులోకి వస్తాయి. అవసరాలను బట్టి నిర్దిష్ట టోల్ విషయమై విధాన నిర్ణయాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. టోల్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్చి నెల చివరి వారంలోపు పరిశీలించి ఆమోదించే అవకాశం ఉందని హిందూస్థాన్ నివేదిక పేర్కొంది. కార్లు, తేలికపాటి వాహనాలపై 5 శాతం, ఇతర భారీ వాహనాలపై 10 శాతం వరకు టోల్ చార్జీ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వాహనదారులకు టోల్ ఫీజుపై రాయితీ ఇస్తూ నెలవారీ పాస్‌లు జారీ చేస్తుంటారు. ఆ పాస్ రుసుము కూడా 10 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
ఏపీలో రెండు రహదారులకు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: భారతమాల పరియోజన కింద ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాజెక్టులకు పాలనాపరమైన ఆమోదం లభించిందని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.909.47 కోట్లతో చిల్లకూరు క్రాస్ రోడ్ నుంచి తూర్పు కనుపూరు వరకు మొత్తం 36.05 కి.మీ పొడవుతో నాలుగు లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణం జరగనుంది. అలాగే, రూ.1,398.84 కోట్లతో నాయుడుపేట (గ్రీన్‌ఫీల్డ్స్) నుంచి తూర్పు కనుపూరు వరకు మొత్తం 34.881 కి.మీ పొడవుతో ఆరులేన్ల నిర్మాణం జరుగుతుందని కేంద్రమంత్రి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. (క్లిక్: రవాణా ఆదాయం రయ్) -
సీటు బెల్ట్ పెట్టుకోలేదో మూడో కన్ను పట్టేస్తుంది!
సాక్షి, అమరావతి: సీటు బెల్టు పెట్టుకోకుండా హైవేపై దూసుకుపోయారా.. అయితే మీ ఇంటికి చలానా వచ్చేస్తుంది. పొల్యూషన్ సర్టిఫికెట్‌గానీ ఇతరత్రా అనుమతులుగానీ లేకుండా వాహనంలో ప్రయాణిస్తున్నారా.. జరిమానా తప్పదు.. మీ వాహనాన్ని ఎవరూ ఆపరు. తనిఖీ చేయరు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాల కొరడా ఝళిపిస్తారు. అదే అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏటీఎస్) పనితీరు. దేశంలో అన్ని హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఉద్యుక్తమైంది. అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ‘అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఏటీఎస్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖల వద్ద ఉన్న వాహనాల డాటాబేస్‌తో అనుసంధానిస్తూ ఏటీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఏటీఎస్ వ్యవస్థను పరీక్షించిన ఎన్హెచ్ఏఐ దశలవారీగా అమలు చేయనుంది. హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ తీరును పరిశీలించేందుకు టోల్గేట్లు, ఇతర ప్రధాన కూడళ్లు, మలుపుల వద్ద సీసీ కెమెరాలను, ఇతర ఆధునిక సాంకేతిక వ్యవస్థను దశలవారీగా ఏర్పాటు చేస్తారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రయాణించే అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను ఈ వ్యవస్థ స్కాన్ చేస్తుంది. ఆ నంబర్ ఉన్న వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్, పిట్నెస్ సర్టిఫికెట్, అవసరమైన ఇతర సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా అని ఆటోమేటిగ్గా పరిశీలిస్తుంది. సరుకు రవాణా వాహనాలను పర్మిట్లు ఉన్నాయా లేదా కూడా పరిశీలిస్తుంది. అవసరమైన సర్టిఫికెట్లు లేవని గుర్తిస్తే వెంటనే ఆ వాహన నంబర్‌ప్లేటు ఆధారంగా జరిమానా విధిస్తారు. సంబంధిత చిరునామాకు చలానా పంపిస్తారు. ఇక ఎవరైనా సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే, సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఆ వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా జరిమానా విధించి సంబంధిత చిరునామాకు చలానా పంపిస్తారు. ఆ జరిమానాలు విధించిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాల రవాణా శాఖ కార్యాలయాలకు ఎన్హెచ్ఏఐ నివేదిస్తుంది. ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు ఆ జరిమానాలను వసూలు చేస్తారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా పటిష్టంగా పర్యవేక్షించడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఏటీఎస్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. -
రేపటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే బాదుడే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రేపటి (ఫిబ్రవరి 15) నుంచి ఫాస్టాగ్ తప్పనిసరిగా అమల్లోకి రానుంది. వాహనాలకు ఫాస్టాగ్ ఉంటేనే హైవేలపైకి ఎక్కాలి, లేదంటే రెట్టింపు టోల్ బాదుడు భరించాల్సివుంటుంది. ఇప్పటికే పలుమార్లు ఫాస్టాగ్ తప్పనిసరి వినియోగాన్ని వాయిదా వేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఫాస్టాగ్ వినియోగంతో హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర సమయం వృథా అయ్యే అవకాశం ఉండదు. వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. దీనికోసం వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఖరీదు వాహనంపై ఆధారపడి ఉంటుంది. ఇక ఫాస్టాగ్ రీఛార్జ్‌ను ఆన్లైన్ లేదా టోల్‌ప్లాజాల వద్ద చేయించుకోవచ్చు. -
వనస్థలీపురంలో దారుణం..చలాన్ల పేరిట దోపిడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలీపురం పోలీస్‌స్టేషన్ పరిధి ఆటోనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారికి పార్కింగ్ డబ్బులు చెల్లించాలని యువకుడని చితకబాదారు. వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా కేసారం బాల్‌రెడ్డి ఇసుక లారీల పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతన్నాడు. నేషనల్ హైవేపే ఆగి ఉన్న లారీ కనిపిస్తే చాలు చలాన్ల పేరిట ముక్కుపిండి డబ్బులు గుంజుతున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే కర్రలతో చితకబాదేవాడు. గతంలోనూ కొంతమంది లారీ డ్రైవర్లు బాల్‌రెడ్డి అక్రమదందాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాజు మరో బాధితుడు భౌతికదాడికి పాల్పడ్డాడు. దీంతో అతను వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. దీంతో నిందితుడి అక్రమ చిట్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. -
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి
సాక్షి, నల్గొండ : నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ (ఆరెంజ్ ట్రావెల్స్) బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నకిరేకల్ మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన వీరు.. చెరువు అన్నారం వైపు ట్రాక్టర్‌పై గడ్డి కోసం వెళ్లారు. అదేసమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న ఐదుగురిలో ఒకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణిస్తున్న వారు మరో బస్సెక్కి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ ఘటనపై కట్టంగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కల్లుపై ‘సుప్రీం’లో ఆసక్తికర వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : కల్లుపై సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. అదొక పోషక విలువలు కలిగిన విటమిన్ పానీయమంటూ కేరళ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. సాధికారిక కమిటీ ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ గతంలో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో కేరళ వ్యాప్తంగా 520 కల్లు దుకాణాలు మూతపడగా.. 3వేల మందికి పైగా కల్లుగీత కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అఫిట్‌విట్ సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనికి స్పందించిన కేరళ ప్రభుత్వం గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో అంశాలు.. ’’కేరళ ఔషద గుణాలున్న పానీయం. అంతేగానీ అది మద్యం కిందకు కాదు. కేరళ సాంప్రదాయక భోజనాల్లో కల్లుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కల్లు ఓ యాంటి-బయోటిక్ అన్న విషయం శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కేన్సర్ వ్యాధికి మూలమైన ఓబీఎస్-2(OBs-2) కణాలను నిర్మూలించే గుణం కల్లులోని చఖరోమైసెస్ అనే సూక్ష్మజీవికి ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా కల్లు కీలకపాత్ర వహిస్తుంది’’ అని పేర్కొంది. కేరళలో కార్మికుల శాతం అధికమన్న ప్రభుత్వం.. వారికి కల్లు ద్వారానే ఆరోగ్యమని తెలిపింది. ఇక మద్యపాన నిషేధం విధించబడిన సమయంలో కూడా.. కల్లుపై నిషేధం విధించని విషయాన్ని అఫిడవిట్లో ప్రస్తావించింది. దీనిద్వారా హని జరుగుతుందన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదని.. అయితే కల్తీ కల్లు విషయంలోనే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అయితే ‘కల్లు మద్యం కేటగిరీలోకి రాదని చెబుతున్నప్పుడు.. కేరళ అబ్కారీ యాక్ట్‌లో దానిని ఎందుకు పొందుపరిచారు’’ అంటూ... చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదే అంశంపై కేరళ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పరిశీలనలు జరుపుతున్న విషయాన్ని కేరళ తరపు న్యాయవాది తెలపటంతో.. కోర్టు తదుపరి వాదనను ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది. -
హైవేలపై కొత్త బార్లకు నో
-
హైవేలపై కొత్త బార్లకు నో
హైవేలపై బార్ల కోసం వచ్చిన దరఖాస్తులు బుట్టదాఖలు 130 కొత్త బార్లకు గాను 57 లెసైన్సుల మంజూరు గ్రేటర్లో 44, జిల్లాల్లో 13 లెసైన్సులు జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు మొదలైంది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 100 మీటర్ల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయతలబెట్టిన బార్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి నిరాకరించింది. రహదారులకు వంద మీటర్ల అవతల బార్ల ఏర్పాటు కోసం వచ్చిన 57 దరఖాస్తులకు మాత్రమే లెసైన్సులు జారీ చేసింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44 కాగా, ఇతర జిల్లాల్లో 13 మాత్రమే ఉన్నాయి. గ్రేటర్ కాకుండా బార్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్న జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల హెడ్ క్వార్టర్లన్నింటికి జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం ఉండటంతో దరఖాస్తులన్నీ బుట్టదాఖలయ్యాయి. 130కిగాను 57 కొత్త బార్లకు మాత్రమే అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో మిగతా 73 బార్లకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. లెసైన్సులు పొందిన వారు ఫీజులు చెల్లించిన తరువాత కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. హైవేలపై ఉన్న 468 ఔట్లెట్లకు నోటీసులు జాతీయ, రాష్ట్ర రహదారులకు 100 మీటర్లలోపు మద్యం అమ్మకాలు నిషేధించాలని జస్టిస్ కె.ఎస్. రాధాకృష్ణన్ నేతృత్వంలోని రహదారి భద్రతా కమిటీ గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అక్టోబర్‌లో కొత్తగా మద్యం దుకాణాలకు లెసైన్సులు జారీచేయడంతో పాటు బార్ల లెసైన్సులను రెన్యూవల్ చేసింది. దీంతో రాష్ట్రంలో 468 బార్లు, మద్యం దుకాణాలు హైవేలపైనే ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌లో రహదారుల భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిసెంబర్ 31 నాటికి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో హైవేలపై ఉన్న గ్రేటర్‌లోని 170తో పాటు 468 మద్యం దుకాణాలు, బార్లకు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో కొత్తగా 130 బార్ల లెసైన్సుల జారీ కోసం వచ్చిన 2,130 దరఖాస్తులను సమీక్షించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 60 బార్లు ఏర్పాటు కావాల్సి ఉండగా 44, ఇతర జిల్లాల్లో 70 బార్లకు అవకాశం ఉంటే కేవలం 13 దరఖాస్తులకే అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఎటు చూసినా హైవేలే! రాష్ట్రంలో 2,495.63 కి.మీ. మేర 13 జాతీయ రహదారులు ఉండగా, 2,023 కి.మీ మేర 17 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. రాష్ట్రంలో 2,800కు పైగా మద్యం దుకాణాలు, బార్లు ఉండగా, వీటిలో 468 హైవేలపైనే ఉన్నాయి. సుప్రీం కమిటీ ఆదేశాల నేపథ్యంలో ఔట్లెట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వ్యాపారులు ఏంచేయాలో తోచని స్థితిలో ఉన్నారు. జిల్లాల్లో మద్యం దుకాణం ఔట్లెట్ స్థలాన్ని ఆయా వార్డుల పరిధిలోని మరో చోటుకు మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, గ్రేటర్‌లోని వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. నగరంలో కొత్తగా దుకాణాలు, బార్లు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు దొరికే అవకాశం లేనందున లక్షలాది రూపాయల లెసైన్సు ఫీజు చెల్లించి ఎక్కడకు పోవాలని 170 మంది మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.