
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలీపురం పోలీస్‌స్టేషన్ పరిధి ఆటోనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారికి పార్కింగ్ డబ్బులు చెల్లించాలని యువకుడని చితకబాదారు. వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా కేసారం బాల్‌రెడ్డి ఇసుక లారీల పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతన్నాడు. నేషనల్ హైవేపే ఆగి ఉన్న లారీ కనిపిస్తే చాలు చలాన్ల పేరిట ముక్కుపిండి డబ్బులు గుంజుతున్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే కర్రలతో చితకబాదేవాడు. గతంలోనూ కొంతమంది లారీ డ్రైవర్లు బాల్‌రెడ్డి అక్రమదందాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాజు మరో బాధితుడు భౌతికదాడికి పాల్పడ్డాడు. దీంతో అతను వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. దీంతో నిందితుడి అక్రమ చిట్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment