న్యూఢిల్లీ: 2019లో ప్రారంభమైన ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే పనులు 2023, మార్చి నాటికి పూర్తి కానునట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే ప్రారంభమైన(2023) నాటి నుంచి కేంద్రానికి ప్రతి నెలా ₹1,000 నుంచి ₹1500 కోట్ల విలువైన టోల్ ఆదాయం వస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌హెచ్‌ఏఐని ఆదాయాన్ని ఉత్పత్తి చేసే "బంగారు గని"గా అభివర్ణించారు. నాలుగు రాష్ట్రాల గుండా వెళ్లే ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పురోగతిని తెలుసుకోవడానికి గడ్కరీ సుడిగాలి పర్యటన చేశారు.
జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయితో పోటీ పడే విధంగా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ హైవే మార్చి 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు 'భారత్ మాల పరియోజన' మొదటి దశలో భాగంగా నిర్మిస్తున్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల గుండా వెళ్లే ఎనిమిది లైన్ల ఎక్స్ ప్రెస్ వే. ఈ హైవే ప్రారంభమైన తర్వాత దేశ రాజధాని, దేశ ఆర్థిక కేంద్రం మధ్య ప్రయాణ సమయం దాదాపు 24 గంటల నుండి 12 గంటలకు తగ్గనుంది.(చదవండి: ఐఫోన్ 13.. భారత్‌లో మరీ అంత రేట్లా?)
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రస్తుత స్థాయి ₹40,000 కోట్ల నుంచి రాబోయే ఐదేళ్లలో ₹1,40,000 లక్షల కోట్ల వార్షిక టోల్ ఆదాయాన్ని వసూలు చేస్తుందని నమ్మకంగా గడ్కరీ నొక్కి చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ ఎక్కువ రుణభారంతో సతమతం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నోడల్ ఏజెన్సీకి 'ఏఏఏ' రేటింగ్ లభించిందని, 'ఏఏఏ' అనేది అత్యధిక క్రెడిట్ రేటింగ్ బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. 2017 మార్చిలో ₹ 74,742 కోట్ల ఉన్న మొత్తం రుణాలు ఈ ఏడాది మార్చి చివరినాటికి ₹ 3,06,704 కోట్లకు పెరిగాయని ఇటీవల మంత్రి రాజ్యసభకు తెలియజేశారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు ఉపాధిని సృష్టిస్తాయని మరియు దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయనీ పేర్కొన్న గడ్కరీ.
Comments
Please login to add a commentAdd a comment