వైభవంగా పవిత్రాధివాసం | vibavamga pavitradhivasam | Sakshi
Sakshi News home page

వైభవంగా పవిత్రాధివాసం

Published Sun, Aug 28 2016 8:23 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

వైభవంగా పవిత్రాధివాసం

వైభవంగా పవిత్రాధివాసం

లక్ష్మీపురం (ద్వారకాతిరుమల): ద్వారకాతిరుమల చినవెంకన్న ఉపాలయం లక్ష్మీపురం శ్రీ వేంకటేశ్వర సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీనివాసుని దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం పవిత్రాధివాసం వేడుకగా జరిగింది. ఆలయ యాగశాలలో పవిత్రాలను ఉంచి ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యహవాచన జరిపించారు. అనంతరం పంచగవ్యప్రోక్షణను జరిపి అగ్నిప్రతిష్ఠాపన నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో పవిత్రాలను ఉంచి ప్రోక్షణ గావించారు. పవిత్రాలను ఉత్సవమూర్తులకు పంచశయ్యాదివాసాన్ని అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛారణలతో జరిపారు. మహాశాంతి హోమాన్ని ఆలయ యాగశాలలో నిర్వహించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement