
రెండు దశాబ్దాల తరువాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) గుజరాత్‌లోని ద్వారకా తీరంలో నీటి అడుగున అన్వేషణను తిరిగి ప్రారంభించింది. ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో అయిదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది.
తొలిసారిగా ఈ అన్వేషణ బృందంలో మహిళా పురావస్తు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. ఏఎస్‌ఐ డైరెక్టర్(తవ్వకాలు, అన్వేషణలు) హెచ్‌కే నాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ అపరాజిత శర్మ, పూనమ్ వింద్, రాజ కుమారీ బార్బీనా పరిశోధన బృందంలో సభ్యులుగా ఉన్నారు.
దశల వారీగా ఈ బృందం అన్వేషణలు కొనసాగిస్తుంది. మొదటి దశలో భాగంగా పరిశోధనల కోసం స్థలాలను గుర్తిస్తారు. తొలిదశలో కనుగొన్న అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ‘ఇదొక అపూర్వమైన అవకాశం’ అంటుంది పూనమ్ వింద్. నిజమే కదా!
(చదవండి: ఆ టీచర్ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..)
Comments
Please login to add a commentAdd a comment