రేప్ కేసులో యువకుడికి 7 ఏళ్ల జైలు శిక్ష
Published Thu, Feb 23 2017 9:19 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM
ఢిల్లీ:
అత్యాచార కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బుధవారం ఢిల్లీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏడెళ్ల జైలు శిక్షతో పాటు రూ.40 వేల జరిమాన విధించింది. గత ఏడాది జనవరిలో పశ్చిమ ఢిల్లీకి చెందిన రాజేందర్ (22) భయపెట్టి అత్యాచారం చేశాడని 21 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా లాక్కెళ్లాడని, సహాయం కోసం అర్తనాదాలు పెట్టినా.. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఎవరు రాలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
అయితే నిందితుడు మాత్రం బాధితురాలి ఆరోపణలు ఖండించాడు. అత్యాచారం చేయలేదని, ఘటన జరిగిన రెండు రోజుల ముందే ఆమెతో వాగ్వాదం జరిగిందన్నాడు. దీనికి ప్రతీకారంగానే తనపై ఫిర్యాదు చేసిందని కోర్టులో తన వాదనలను వినిపించాడు. ఈ కేసు వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడని 376 (అత్యాచారం), 506 (భయపెట్టడం) సెక్షన్ల కింద నిందితుడికి 7 ఏళ్ల శిక్ష, రూ. 40 వేల జరిమాన విదిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసు తీర్పుకు ఏడాది సమయం పట్టింది.
Advertisement
Advertisement