fastrack court
-
‘బాబర్నేందుకు పూజించాలి..?’
లక్నో : రామ జన్మభూమి వివాదం పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరతనంటున్నారు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోధ్య వివాదం ఎప్పటినుంచో కొనసాగుతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. ఇందుకుగాను నేను సుప్రీం కోర్టును కలిశి.. సమస్య పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా కోరతానని తెలిపారు. శబరిమల ఆలయం కేసులో సుప్రీం కోర్టు చాలా త్వరగా తీర్పు చెప్పింది. మరి 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామ జన్మభూమి కేసు విషయంలో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని చూపిస్తూ.. దీనిలో రాముని గురించి ఉంది, కృష్ణుని గురించి ఉంది ఆఖరుకి అక్బర్ గురించి కూడా ఉంది. కానీ బాబర్ గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు మేమేందుకు బాబర్‌ను పూజించాలని ప్రశ్నించారు. అయితే ఇలాంటి విషయాలు మాట్లాడితే.. వేరే రకమైన వివాదాలు తలెత్తుతాయన్నారు. -
రేప్ కేసులో యువకుడికి 7 ఏళ్ల జైలు శిక్ష
ఢిల్లీ: అత్యాచార కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బుధవారం ఢిల్లీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏడెళ్ల జైలు శిక్షతో పాటు రూ.40 వేల జరిమాన విధించింది. గత ఏడాది జనవరిలో పశ్చిమ ఢిల్లీకి చెందిన రాజేందర్ (22) భయపెట్టి అత్యాచారం చేశాడని 21 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తుండగా లాక్కెళ్లాడని, సహాయం కోసం అర్తనాదాలు పెట్టినా.. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఎవరు రాలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిందితుడు మాత్రం బాధితురాలి ఆరోపణలు ఖండించాడు. అత్యాచారం చేయలేదని, ఘటన జరిగిన రెండు రోజుల ముందే ఆమెతో వాగ్వాదం జరిగిందన్నాడు. దీనికి ప్రతీకారంగానే తనపై ఫిర్యాదు చేసిందని కోర్టులో తన వాదనలను వినిపించాడు. ఈ కేసు వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడని 376 (అత్యాచారం), 506 (భయపెట్టడం) సెక్షన్ల కింద నిందితుడికి 7 ఏళ్ల శిక్ష, రూ. 40 వేల జరిమాన విదిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసు తీర్పుకు ఏడాది సమయం పట్టింది. -
‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలి’
కొల్లాపూర్: వర్షిణి మృతిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుచే విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోళ్లశివ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు. మండల పరిధిలోని కుడికిళ్ల గ్రామంలో ఇటీవల అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆకుతోట వర్షిణి మృతిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, సీఐడీచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుండగులను నిర్భయ చట్టం ద్వారా శిక్షించాలని అన్నారు. ఈ కేసులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనకు సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో దండోరా తాలూకా ఇన్చార్జి లక్ష్మయ్య, జిల్లా నాయకులు వడ్డెమాన్ రాముడు, సన్నయ్య, కుర్మయ్య, ఎంఎస్ఎఫ్ తాలూకా ఇన్చార్జ్ తోలు రాముడు, విద్యార్థులు పాల్గొన్నారు.