శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళాల వెల్లువ | funds to srivari nityannadana trust | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళాల వెల్లువ

Published Sun, Aug 28 2016 9:28 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళాల వెల్లువ - Sakshi

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళాల వెల్లువ

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఆదివారం విరాళాలు వెల్లువెత్తాయి. జంగారెడ్డిగూడేనికి చెందిన రిటైర్డ్‌ హెచ్‌ఎం చిన్నం సుబ్బారావు, జగదీశ్వరి దంపతులు రూ.2,02,232ను విరాళంగా అందజేశారు. దీనిలో సుబ్బారావు పేరున రూ.1,01,116, జగదీశ్వరి తల్లిదండ్రుల పేరున రూ.1,01,116ను అందజేశారు. సుబ్బారావు కుమారుడు, కోడలు రాంబాబు, ప్రమీళకుమారి, కుమార్తె అల్లుడు అంబటి గాంధీ, నాగమణి ఉన్నారు.  మచిలీపట్నంకు చెందిన డేరం రామకష్ణ శర్మ, సీతామహాలక్ష్మి దంపతులు తమ కుమార్తె శైలజ పేరున రూ.1,01,116ను అందజేశారు. దాతలకు ఈవో త్రినాథరావు విరాళం బాండ్‌లు అందజేశారు. 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement