ఏకంగా ఆరు సినిమాలు లైన్లో పెట్టాడు..!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ ఫాంలో ఉన్నాడు. పెళ్లిచూపులు సక్సెస్ ఇచ్చిన జోష్ ఏకంగా ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ద్వారక సినిమాను దాదాపుగా పూర్తి చేసిన విజయ్, అర్జున్ రెడ్డి సినిమా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తరువాత తాను చేయబోయే సినిమాల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు విజయ్. రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమాకు ఓకె చెప్పాడు విజయ్.
ఈ సినిమాలతో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీని ఫిబ్రవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడు. పెళ్లిచూపులు సినిమాను నిర్మించిన రాజ్ కందుకూరి నిర్మాణంలో వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడు. వీటితో పాటు భరత్ అనే కొత్త దర్శకుడితోనూ సినిమాకు ఓకె చెప్పాడు. వరుసగా ఆరు సినిమాలను లైన్ లో పెట్టిన విజయ్, రెమ్యూనరేష్ విషయంలోనూ కాస్త బెట్టు చేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.