భార్యపై అనుమానంతో భర్త రోకలి బండతో తలపై బాది హత్య చేశాడు.
కాకుమాను (గుంటూరు జిల్లా): భార్యపై అనుమానంతో భర్త రోకలి బండతో తలపై బాది హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా కాకుమాను మండలం పాంత్రపాడు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సజ్జనరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య ద్వారకా (30), కుమార్తె సంధ్య ఉన్నారు.
అయితే, గత కొంతకాలంగా భార్యను అతడు అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేశారు.