ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలి
Published Sun, Aug 7 2016 12:41 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రతి శాఖలో సిబ్బందికి మరుగుదొడ్డి, మంచినీళ్లు వంటి కనీస వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో బయోమెట్రిక్, ఇ–కార్యాలయం విధానం అమలు ప్రగతిపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు శాఖా కార్యాలయాలను తాను స్వయంగా పరిశీలిస్తే ఆయా కార్యాలయాల్లో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసిందని, పలువురు వారి వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి కార్యాలయంలో కనీస వసతులు కల్పించాలని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సిబ్బంది వారి కార్యాలయాల్లో పరిశుభ్రత చేసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement