షార్ట్‌ఫిల్మ్స్‌పై ఆసక్తి చూపండి
షార్ట్‌ఫిల్మ్స్‌పై ఆసక్తి చూపండి
Published Sat, Jan 28 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
పాలకొల్లు సెంట్రల్ : విదేశాల్లో ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటారు.. అదే ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలోనే మాట్లాడుకుంటారు.. ఇది తెలుగు భాషకు మనవాళ్లు ఇచ్చే గౌరవమని దర్శకుడు వీరశంకర్ అన్నారు. శనివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో క్షీరపురి అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవ కమిటీ, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సినిమా రంగంపై విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. యువత తెలుగు భాషను మర్చిపోతే భవిష్యత్‌లో తెలుగు సినిమాలు చూడలేమని, సంకరజాతి సినిమాలే వస్తాయని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సినిమా రంగంలో 25 శాతం మంది కళాకారులు పాలకొల్లు నుంచి వచ్చినవారే ఉన్నారని, కళారంగానికి క్షీరపురి పుట్టినిల్లు వంటిదన్నారు. యువత షార్ట్‌ఫిల్మ్స్‌పై ఆసక్తి చూపాలని, దీనిలోనూ మంచి ఆదాయం వస్తుందని సూచించారు. యూ ట్యూబ్‌లో రోజుకు 200 షార్ట్ ఫిల్‌్మలు అప్‌లోడ్ అవుతున్నాయని చెప్పారు. దర్శకులు సముద్రాల రఘునా«థ్, ఆకుమర్తి బాబూరావు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, కథా రచనలపై విద్యార్థులకు వివరించారు. కెమెరామెన్ ధనిశెట్టి రాంబాబు ఫొటోగ్రఫీలోని మెలకువల తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దర్శకులకు సన్మానం చేశారు. చిత్రోత్సవ కమిటీ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, కన్వీనర్ డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, క్లబ్ సభ్యులు కొమ్ముల ముర ళి, రేపాక ప్రవీణ్‌భాను, చాంబర్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement