కడప కల్చరల్ : జిల్లాలోని పలువురు దేవాదాయ, ధర్మాదాయశాఖ ఈఓలను బదిలీ చేశామని అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జె.రవిశేఖర్‌రెడ్డిని మైదుకూరుకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1 ఈఓగా బదిలీ చేశామన్నారు. కర్నూలుజిల్లా నుంచి మన జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఈఓలలో మహేశ్వర్‌రెడ్డిని గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2కు బదిలీ చేశామన్నారు. వేంపల్లె ఎద్దుల కొండ ఈఓ ఎస్‌ఏ ప్రతాప్‌ను గ్రేడ్–2 నుంచి అక్కడే గ్రేడ్–1గా నియమించామన్నారు. ప్రొద్దుటూరుకు చెందిన బి.చంద్రశేఖర్‌రెడ్డి అక్కడే ముక్తిరామేశ్వరం, వెంకట సుబ్బయ్య సత్రం ఈఓగా నియమించామన్నారు. జి.వెంకట సుబ్బయ్యను సీకే దిన్నె గంగమ్మ ఆలయ ఈఓగా నియమించామన్నారు. టి.మద్దిలేటిని ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, హనుమంతేశ్వర ఆలయాలకు ఈఓగా నియమించామన్నారు. అనంతపురం నుంచి వచ్చిన ఇద్దరు ఈఓలలో బీఆర్ వెంకటేశ్వరరావును ప్రొద్దుటూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌కు ఈఓగా నియమించామని వెల్లడించారు.