శ్రీదేవి, భూదేవి సమేత తిరుచ్చిపై విహరిస్తున్న శ్రీనివాసుడు.
శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి వారు శనివారం తిరుచ్చి వాహనంపై నాలుగుమాడ వీధులలో విహరించారు.
శ్రీనివాస మంగాపురం(చంద్రగిరి):
శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి వారు శనివారం తిరుచ్చి వాహనంపై నాలుగుమాడ వీధులలో విహరించా రు. పెరటాసి నెల సందర్భంగా వారపు ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారికి ఫల, పుష్ప సుగంధ పన్నీటి ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. తదుపరి స్వామివారిని పట్టుపీతాంబరాలు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలతో శోభాయమానంగా అలంకరిం చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కల్యాణ æమండంపం లోకి వేంచేపు చేసి, వైఖానస ఆగమోక్తంగా కన్నుల పండువగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలంకిచడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివాహం కాని యువతీ, యువకులు త్వరగా వివాహం కావాలని స్వామివారి కంకణాలను ధరించి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఉత్సవర్లకు ఆలయ ప్రాంగణంలో కన్నుల పండుగవగా ఊంజల్‌సేవను నిర్వహించారు. తిరిగి సాయంత్రం స్వామి, అమ్మవా ర్లు తిరుచ్చి వాహనంపై ఆశీనులై నాలుగుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా భక్తులు దేవేరులకు ధూప ధీప నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ధనుంజయ, ఇన్‌స్పెక్టర్లు దినకర రాజు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.