కుంభవృష్టి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట)/తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లాలో పలుచోట్ల శనివారం కుంభవృష్టి వర్షం కురిసింది. అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురవగా.. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, కొవ్వూరు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా తాడేపల్లిగూడెంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏలూరు, నిడదవోలు, తణుకు, దెందులూరు, అచంట ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. చింతలపూడి, పాలకొల్లు, భీమవరం, ఉండి, గోపాలపురం, పోలవరం ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కుండపోత వర్షానికి తాడేపల్లిగూడెంలో నీట మునిగిన ప్రధాన రహదారి ఇది.