శాంతి కల్యాణంలో పాల్గొన్న హీరో సునీల్
శాంతి కల్యాణంలో పాల్గొన్న హీరో సునీల్
Published Sat, Feb 25 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
దేవరపల్లి (ద్వారకాతిరుమల) : ధన్వంతరీ సంపుటిత జ్వాలా నరసింహ సుదర్శన మహాయజ్ఞం ముగింపును పురస్కరించుకుని సుందరగిరిపై నృసింహ క్షేత్రంలో శనివారం ఉదయం శాంతి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన సుదర్శన మహాయజ్ఞంలో సినీ హీరో సునీల్ పాల్గొని యజ్ఞక్రతువును నిర్వహించారు. ఈ యజ్ఞం శనివారం తెల్లవారుజామున జరిగిన మహాపూర్ణాహుతితో ముగిసింది. అనంతరం రుత్వికులు, పండితులు సాలిగ్రామాలను అభిషేకించారు. మంగళకర శాంతి మంత్రాలతో రుద్రం, రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.
Advertisement
Advertisement