
రచయితలను జ్ఞాపిక, పుస్తక నిధితో సత్కరిస్తున్న నిర్వాహకులు
48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిత్తూరు జిల్లా రచయితల మహాసభలు జరుపుకోవడం శుభపరిణామమనీ. ఈ సభలు మరింత సాహితీ వికాసంతో భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ప్రముఖ రచయిత కట్టమంచి బాలకృష్ణా రెడ్డి ఆకాంక్షించారు.
– ఘనంగా ప్రారంభమైన జిల్లా రచయితల మహాసభలు
– 48 ఏళ్ల తర్వాత సాహితీ అమానుల సందడి
– సమాజంలో విలువలు కాపాడే వారే కవులు ర^è యితలు
తిరుపతి కల్చరల్:
48 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిత్తూరు జిల్లా రచయితల మహాసభలు జరుపుకోవడం శుభపరిణామమనీ.. ఈ సభలు మరింత సాహితీ వికాసంతో భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ప్రముఖ రచయిత కట్టమంచి బాలకృష్ణా రెడ్డి ఆకాంక్షించారు. తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్‌లో శనివారం జిల్లా రచయితల మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 400 మంది కవులు, రచయితలు, సాహితీ అభిమానులు హాజరయ్యారు. సాహితీ పండుగలా సాగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ర^è యితలు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, పద్మా నాయుని కృష్ణమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుమ్మల కన్నయ్య నాయుడు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కట్టమంచి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ 48 ఏళ్ల తర్వాత రచయితల సభలను జరుపుకోవడం.. ఇంతమంది కవులు, రచయితలు హాజరుకావడం ఆనందదాయకమన్నారు. ఈ సభలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. తుమ్మల కన్నయ్య నాయుడు మాట్లాడుతూ సమాజంలో విలువలు కాపాడే వారే కవులు, రచయితలని తెలిపారు. నాటి భారత, భాగవత, పురాణ ఇతిహాసాల ఆధారంగానే నేడు కుటుంబాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు మధుర భాష అనే మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయని, ఇవి ఆచారణలో రావాల్సిన అవసరం ఉందన్నారు. మానవీయ బంధాలతో ముడిపడిన అమ్మ, నాన్న, అవ్వ, తాత అనే తెలుగు పదాలు వాడుకలోకి వచ్చినప్పుడే మాతృభాష వికాసం చెందుతుందన్నారు. అనంతరం ‘చిత్తూరు సాహిత్యం నాటి నుంచీ నేటి దాకా’ అనే అంశంపై ఆచార్య మధురాంతక నరేంద్ర, ఇంద్రవెల్లి రమేష్ మాట్లాడుతూ అక్షరానికి వందనం, కవి మస్తానికి అభినందనం అంటూ కొనియాడారు. రాష్ట్ర గీతాన్ని అందించిన శంకరం బాడి సుందరాచారి జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కంపెల్ల శైలజ, కొలకలూరి మధుజ్యోతి అన్నమయ్య, వేమన, వీరభ్రహ్మంల సామాజిక విప్లవాన్ని వివరించారు. సీమకథ –కొత్త సందర్భం అనే అంశంపై ప్రముఖ రచయితలు బండి నారాయణస్వామి, ఆర్‌ఎం.ఉమాహేశ్వరరావు మాట్లాడుతూ నాటి వందేళ్ల కథ సాగిన వి«ధాన్ని గురించి వివరించారు. ‘బాలసాహిత్యం –ఇంటా బయటా’ అనే అంశంపై ఎం.హరికిషన్, కుమారస్వామి మాట్లాడారు. ప్రముఖ కథా రచయిత సి.వేణు వారసుడైన భానుమూర్తి మాట్లాడుతూ ఇంట్లో తెలుగు మాట్లాడే విధానాన్ని ప్రోత్సహిస్తూ తెలుగు భాష మాధుర్యాన్ని పిల్లలకు తెలియజేసి భాషా వికాసానికి దోహదపడాలని తెలిపారు. జిల్లా రచయితల సభల్లో తొలి రోజు సంపాదకుడు రాఘవశర్మ అందించిన చిత్తూరు సాహితీ సౌగంధం, సుబ్రమణ్యం పిళ్లై గిరిధరన్ రచించిన భాగవతం కథలు, రావినూతల శ్రీరాములు రచించిన మరుపు రాని మహానిషి మాడభూషి అనంతశయనం అయ్యంగార్, దాసరి కృష్ణారెడ్డి రచించిన శ్రీబోయకొండ గంగమ్మ తల్లి ఆలయ సంగ్రహ చరిత్ర, కవిసంధ్య కవిత్వ పత్రిక మూడవ సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు సాకం నాగరాజు, పలమనేరు బాలాజీ, గార్లపాటి దామోదరనాయుడు, మౌని, కలువగుంట రామ్మూర్తి, జిల్లేళ్ల బాలాజీ, మేడిపల్లి రవికుమార్, అట్టాడ అప్పల్నాయుడు, నాగసూరి వేణుగోపాల్, గంగవరం శ్రీదేవి, పేరూరు బాలసుబ్రమణ్యం, యువశ్రీ మురళి, గంటామోహన్, నాదెండ్ల శ్రీమన్నారాయణ, దేవరాజులు, మస్తానమ్మ, కుమారస్వామిరెడ్డి, తులసీనాథంనాయుడు, నెమిలేటి కిట్టన్న, రంగనాయులు పాల్గొన్నారు.