మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు
మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు
Published Sun, Nov 20 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు కల్యాణ పూజలను వేదమంత్రాలతో జరిపారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి దేవస్థానం ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, హైమా పార్వతి దంపతులు, వీరి కుమార్తెలు తులసి లక్ష్మి, హైదరాబాద్‌కు చెందిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రమాదేవి దంపతులు స్వామివారికి తమలపాకులతో పూజలు జరిపారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన వనపర్తి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు వనపర్తి శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు, బచ్చు రామమోహనరావు, వెంకట లక్ష్మి దంపతులు, బయ్యనగూడెంకు చెందిన సందక శ్రీనివాసులు, సూర్యకుమారి దంపతులచే అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కరోజు ఆదాయం రూ. 1,87,710 వచ్చినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథ రాజు తెలిపారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మద్దిలో నేడు : మద్దిక్షేత్రంలో ఆదివారం ఆంజనేయస్వామికి సువర్చలా హనుమద్ కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందన్నారు.
Advertisement
Advertisement