in maddi
-
మద్ది అంజన్నకు ప్రత్యేక పూజలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి లక్ష తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు కల్యాణ పూజలను వేదమంత్రాలతో జరిపారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి దేవస్థానం ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, హైమా పార్వతి దంపతులు, వీరి కుమార్తెలు తులసి లక్ష్మి, హైదరాబాద్‌కు చెందిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రమాదేవి దంపతులు స్వామివారికి తమలపాకులతో పూజలు జరిపారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన వనపర్తి సుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు వనపర్తి శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు, బచ్చు రామమోహనరావు, వెంకట లక్ష్మి దంపతులు, బయ్యనగూడెంకు చెందిన సందక శ్రీనివాసులు, సూర్యకుమారి దంపతులచే అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కరోజు ఆదాయం రూ. 1,87,710 వచ్చినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథ రాజు తెలిపారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మద్దిలో నేడు : మద్దిక్షేత్రంలో ఆదివారం ఆంజనేయస్వామికి సువర్చలా హనుమద్ కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు కల్యాణం ప్రారంభమవుతుందన్నారు. -
ముగిసిన సప్తాహ మహోత్సవాలు
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సప్తాహ మహోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఇందుకూరి రంగరాజు, లీలారాణి దంపతులచే ఆలయ అర్చకులు, వేద పండితులు సప్తాహ మహోత్సవ ముగింపుల పూజలు, మహా శాంతి హోమం పూజలు జరిపించారు. స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. 2 వేల మంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన మండలి సభ్యులను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు సత్కరించారు. ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు పాల్గొన్నారు. -
అంజన్న సేవలో హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్
జంగారెడ్డిగూడెం రూరల్ :జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని ఆదివారం హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ కొక్కుల శ్రీనివాసరావు, ఆయన సతీమణి ఏలూరు–2 అదనపు జిల్లా జడ్జి కొక్కుల సాయి రమాదేవి దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో పూజల అనంతరం వేద ఆశ్వీరచనాలు అందజేసి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. వీరి వెంట జంగారెడ్డిగూడెం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎంవీఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు.