కొత్తగా 12 డిస్టలరీలు ఏర్పాటు
Published Sun, Sep 25 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
నరసాపురం : మన రాష్ట్రంలో అవసరాలకు తగిన విధంగా మద్యం ఉత్పత్తి జరగడం లేదని రాష్ట్ర ఎక్సైజŒ æశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం నరసాపురం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 12 డిస్టలరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుం ఉన్న 4 డిస్టలరీల ద్వారా ఉత్పత్తి అవుతున్న మద్యం, డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. కొత్త డిస్టలరీల ఏర్పాటుతో కొంతమేర ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయన్నారు. రాష్ట్రంలో నాటు సారా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా గ్రామాల్లో దాడులు చేయడం, నాటుసారా వ్యాపారులు తయారీదారుల్లో పరివర్తన తీసుకొచ్చే కార్యక్రమాలు, సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్‌పర్సన్ పి.రత్నమాల పాల్గొన్నారు.
Advertisement
Advertisement