nsp
-
ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీ విడదీత
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఎన్ఎండీసీ నుంచి నిర్మాణంలో ఉన్న నాగర్నర్ స్టీల్ ప్లాంటు(ఎన్ఎస్పీ)ను విడదీసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్టీల్ శాఖ తాజాగా వెల్లడించింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసే బాటలో కంపెనీకి చెందిన వాటాదారులు, రుణదాతలతో నేడు(7న) సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి ఐదు నెలల్లో ఎన్ఎస్పీని పూర్తిస్థాయిలో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్రం ఉన్నట్లు ఒక అధికారిక ప్రతిలో స్టీల్ శాఖ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ సమీపంలో 3 మిలియన్ టన్నుల వార్షిక(ఎంటీపీఏ) సామర్థ్యంతో ఎన్ఎస్పీ ఏర్పాటవుతోంది. 1,980 ఎకరాలలో యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఇందుకు రూ. 23,140 కోట్లు వెచ్చిస్తున్నట్లు అంచనా. ఎన్ఎండీసీ నుంచి ఎన్ఎస్పీని విడదీసేందుకు 2020 అక్టోబర్‌లో కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. తద్వారా కంపెనీలో కేంద్రానికున్న మొత్తం వాటాను వ్యూహాత్మక కొనుగోలుదారుడికి విక్రయించనుంది. మంగళవారం నిర్వహించనున్న సమావేశాలకు స్టీల్ శాఖ అదనపు కార్యదర్శి రాశికా చౌబే అధ్యక్షత వహించనున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎండీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం నీరసించి రూ. 125 వద్ద ముగిసింది. -
సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవే!
చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి ఇంకా కొనసాగుతున్న కారణంగా 2021-22 రెండవ త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎన్ఎస్పీ, కేవీపీ వంటి చిన్న పొదుపు పథకాలపై కేంద్రం వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో సెప్టెంబర్ 30 వరకు పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లు ఉంటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు వరుసగా ఐదు త్రైమాసికాలు(సెప్టెంబర్ 30, 2021వరకు) వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకుండా అదేవిధంగా ఉంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో ఇలా ఉంది.. "ఈ ఆర్థిక సంవత్సరం జూలై 1, 2021 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30, 2021తో ముగిసే రెండవ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు అనేవి మొదటి త్రైమాసికంలో(ఏప్రిల్ 1, 2021 నుంచి జూన్ 30, 2021) ఉన్న వడ్డీ రేట్లు మాదిరిగానే ఉండనున్నాయి" అని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం వడ్డీ రేటు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎన్ఎస్పీ)పై 6.8% వార్షిక వడ్డీ రేటు లభిస్తాయి. అలాగే నెలవారీ ఇన్కమ్ అకౌంట్‌పై 6.6 శాతం, సేవింగ్స్ ఖాతాపై 4 శాతం ఇలా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై గత త్రైమాసికంలో ఉన్న వార్షిక వడ్డీ రేట్లే ఉంటాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు - 7.1 శాతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీరేటు - 6.8 శాతం సుకన్య సమృద్ధి యోజన వడ్డీరేటు - 7.6 శాతం కిసాన్ వికాస్ పత్రా వడ్డీరేటు - 6.9 శాతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు - 7.4 శాతం చదవండి: గ్లోబల్ సైబర్ సెక్యూరిటీలో చైనాను దాటేసిన భారత్ -
ఎన్నెస్పీకి విద్యుత్ షాక్!
స్థలాలు, భవనాలు లేకున్నా భారం మిగిలింది.. రూ.2 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు ఆరా.. ఖమ్మం అర్బన్: ఎన్నెస్పీ అధికారులకు విద్యుత్ బిల్లుల భారం చుట్టుకుంది. ఏకంగా రూ. 2 కోట్లకు పైగానే విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ సదరు శాఖ నోటీసులు జారీ చేసింది. నగరంలో ఒకప్పుడు ఎవరికి భూమి కావాలన్నా ఎన్నెస్పీ మిగులు భూములు గుర్తుకొచ్చేవి. సుమారు 40 ఏళ్లకుపైగా ఓ వెలుగు వెలిగిన శాఖ ఇప్పుడు సొంత భవనాలు కోల్పోయి.. ప్రభుత్వం చూపించిన తాత్కాలిక ఇరుకు గదుల్లో నెట్టుకొస్తోంది. నగరంలోని గట్టయ్య సెంటర్‌కు ఆనుకొని ఎన్నెస్పీ క్యాంప్ ఉంది. దానికోసం సాగర్ కాల్వల సమయంలో భూ సేకరణ చేశారు. సుమారు 94 ఎకరాలకుపైగా సేకరించి.. అందులో ఎన్నెస్పీ అధికారులు, సిబ్బంది నివాసం ఉండేందుకు సుమారు 800 వివిధ రకాల క్వార్టర్లు నిర్మించారు. అప్పుడు క్యాంప్ అంతటికీ ఒకే టాన్స్‌ఫార్మర్ అమర్చి.. దాని ద్వారా విద్యుత్ శాఖ అధికారులు రీడింగ్ తీసి ఎన్నెస్పీ శాఖ నుంచి వసూలు చేశారు. క్వార్టర్లలో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది మాత్రం చిన్న క్యార్టర్‌కు రూ.300, పెద్ద వాటికి రూ.500 వసూలు చేసేవారు. అయితే విద్యుత్ ఎంత వాడుకున్నా క్వార్టర్లలో ఉండే వారి వద్ద మాత్రం ఖరారు చేసిన పై మొత్తాన్ని వసూలు చేసేవారు. అది పోగా.. మిగిలిన మొత్తం బిల్లు ఎన్నెస్పీ ఖాతా నుంచి చెల్లించేవారు. తర్వాత ఆ క్వార్టర్లపై రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల దృష్టి పడింది. దీంతో ఎవరికి వారే తమ అధికారాన్ని ప్రదర్శించి.. క్వార్టర్లు కేటాయించుకుని నివాసం ఉన్నారు. వారికి తోడు ఉద్యోగుల పేరుతో ప్రైవేటు వ్యక్తులు కూడా దర్జాగా నివాసం ఉన్నారు. వారంతా నెలనెలా విద్యుత్‌ను అవసరం ఉన్న మేరకు దర్జాగానే వాడుకొని మినిమమ్ బిల్లు చెల్లిస్తూ వచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఎన్నెస్పీ అధికారులు ఇన్నేళ్లుగా చెల్లించారు. క్వార్టర్లలో కొన్ని భవనాలు శిథిలం కావడంతో వాటిని ఖాళీ చేశారు. మరికొన్నింటిని అధికారులు గత ఏడాది బలవంతంగానే ఖాళీ చేయించచి.. మొత్తం క్వార్టర్లను కూల్చివేశారు. భవనాలు కూల్చివేసిన తర్వాత కూడా విద్యుత్ వాడకం, వాటికి సంబంధించిన బిల్లులు కూడా యథివిధిగానే వస్తున్నాయి. ఈ క్రమంలో కూల్చిన క్వార్టర్లను అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. దీంతో అవి రూ.2కోట్లకుపైగా పేరుకుపోయాయి. తక్షణమే ఆ బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు తరచు లేఖలు పంపుతున్నారు. మంత్రి హరీష్‌రావు ఆరా.. ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్‌నకు ఉపయోగించిన విద్యుత్ బిల్లుల భారంపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరా తీసినట్లు తెలిసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యుత్ బిల్లులపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నెస్పీ పేరుతో కేటాయించిన విద్యుత్ కనెక్షన్లు వినియోగించే వాటిని ఉంచి.. మిగతా వాటిని విద్యుత్ శాఖకు తిరిగి ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం బకాయి ఉన్న రూ.2కోట్ల మొత్తాన్ని చెల్లించేందుకు తనకు నివేదిక పంపించాలని ఆదేశించినట్లు సంబంధిత ఓ అధికారి తెలిపారు. -
మీనం.. మృత్యుతీరం
నరసాపురం రూరల్ : జిల్లాలోని తీర ప్రాంతం మృత్యు చేపలతో నిండిపోతోంది. భారీ సంఖ్యలో చేపలు కొట్టుకువస్తున్నాయి. కొద్దిరోజుల కిందట చెన్నై సమీపంలో రెండు నౌకలు ఢీ కొనడంతో చమురు భారీగా సముద్రంలో కలవడంతో జలాలు కలుషితమయ్యాయి. చమురు ప్రభావానికి సముద్రంలోని చేపలు భారీగా చనిపోయి కొట్టుకువస్తున్నాయి. నాలుగు రోజుల కిందట డాల్ఫిన్ లు, తాబేళ్లు కొట్టుకురాగా శనివారం భారీసంఖ్యలో చేపలు కొట్టుకొచ్చాయి. అంతేకాకుండా శనివారం మత్స్యకారుల ఐలు వలకు టన్నుల కొద్దీ మత్స్యసంపద చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీటిలో ఎక్కువ శాతం జెల్ల, గొరక జాతులకు చెందిన చేపలు ఉన్నట్టు మత్స్యకారులు తెలిపారు. వేములదీవి పెద్ద ఐలు వలకు చిక్కిన చేపలను రూ.1.5 లక్షలకు, మరో వలకు చిక్కిన చేపలను రూ.90 వేలకు విక్రయించారు. వీటిని కేవలం ఫీడ్ తయారీకి ఉపయోగిస్తారని తెలిపారు. కొట్టుకొచ్చిన చేపలతో తీరంలో దుర్వాసన వెదజల్లుతోంది. -
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం : జాతీయస్థాయి పురుషుల కబడ్డీ పోటీల విజేతగా విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు, మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు చాంపియన్లుగా నిలిచాయి. నరసాపురం రుస్తుంబాధలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌ల్లో పురుషుల విభాగంలో విజయాబ్యాంక్ కర్ణాటక జట్టు 28–16 స్కోర్ తేడాతో బాబా హరిదాస్ హర్యానా జట్టుపై విజయం సాధించింది. మహిళల విభాగంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు 27–25 పాయింట్ల తేడాతో గురుకుల్ హర్యానా(ఏ) జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. తొలుత మూడు, నాలుగు స్థానాల కోసం కూడా పోటీ తీవ్రంగా సాగింది. పురుషుల విభాగంలో మూడు, నాలుగు స్థానాల కోసం ఆంధ్రా, పోస్టల్ కర్నాటక మధ్య పోటీ జరిగింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 2 పాయింట్ల తేడాతో ఆంధ్రా జట్టు గెలిచి మూడోస్థానంలో నిలిచింది. పోస్టల్ కర్నాటక జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో హర్యానా(బి), దిండిగళ్ చెన్నై జట్లు నిలిచాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో హర్యానా(బి) జట్టు 8 ఫాయింట్ల తేడాతో దిండిగళ్ చెన్నై జట్టును ఓడించింది. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభలో పురుషుల విజేత జట్టుకు రూ.1 లక్ష నగదు, రెండోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.50 వేలు, నాలుగోస్థానంలో నిలిచిన జట్టుకు రూ.25 వేల నగదు, షీల్డులు అందించారు. మహిళా విభాగంలో గెలుపొందిన జట్లకు కూడా ఇదేరకంగా బహుమతులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.వీర్లవెంకయ్య, జిల్లా కార్యదర్శి ఎం.రంగారావు పాల్గొన్నారు. -
నిలువెల్లా నిర్లక్ష్యం
* కాలువ చివరి భూముల రైతులకు నీటి కష్టాలు * దొంగలపాలైన యంత్ర పరికరాలు * నిరుపయోగంగా గార్డ్ రూములు * పట్టించుకోని అధికారులు వినుకొండ రూరల్ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మేజర్ల పరిధిలోని రైతుల చివరి భూములకు నీరందేందుకు వీలుగా ఏర్పాటుచేసిన కెనాల్ ఆటో మిషన్లు కనుమరుగవుతున్నాయి. సాగర్ కుడి కాలువ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్టు కింద 2005లో సుమారు రూ.30 లక్షల వ్యయంతో గార్డ్ రూములు నిర్మించారు. నియోజకవర్గంలో 16 మేజర్లు ఉండగా ఎనిమిది మేజర్లపై గార్డు రూములు నిర్మించారు. అవి ఇప్పుడు అలంకారప్రాయంగా మిగిలాయి. ఇనిమెళ్ల, అంగలూరు, పెరుమాళ్లపల్లి, పెదకంచర్ల మైనర్, పేరూరపాడు, దొండపాడు, చీకటీగలపాలెం, పలుకూరు మేజర్ కాలువలపై అప్పటి అధికారులు గార్డ్ రూములు నిర్మించారు. వీటి వద్ద మేజర్లకు వచ్చే నీటి వివరాలు నమోదుచేసేందుకు తొట్లు ఏర్పాటు చేశారు. ఇవి అందించే వివరాలతో వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కావడంతో ఏ మేజర్లలో ఎంత పరిమాణంలో నీరు ప్రవహిస్తుంది.. అవసరమైన మేజర్లకు ఎంతమేర నీరు విడుదల చేయాలనేది స్పష్టంగా తెలియడంతో సమస్యను అధికారులు పరిష్కరించేవారు. ఏ మేజర్‌కు ఎంతెంత.. ఇనిమెళ్ల మేజర్‌కు 23.17 క్యూసెక్కుల నీరందించే లక్ష్యంతో మూడు గార్డ్ రూములు, అంగలూరు 50.71 క్యూసెక్కులకు మూడు, పేరుమాళ్లపల్లి 194.8 క్యూసెక్కులకు 8, పెదకంచర్ల మైనర్ 70.12 క్యూసెక్కులకు మూడు, పేరూరపాడు 30.47 క్యూసెక్కులకు రెండు, దొండపాడు 56.04 క్యూసెక్కులకు రెండు, పలుకూరు 36.39 క్యూసెక్కులకు రెండు గార్డు రూములు నిర్మించారు. వీటి ప్రకారం రైతులకు నీరు సరఫరా చేయాల్సిఉంది. వీటి ఏర్పాటు అనంతరం వరుస కరువు, సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో అవి మూలనపడ్డాయి. మారుమూల ప్రాంతాల్లోని గార్డ్ రూముల్లోని పరికరాలు దొంగలపాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో కంట్రోల్ రూమ్‌ను సంవత్సరాల తరబడి పట్టించుకోకపోవడంతో యంత్ర పరికరాలు తుప్పుపట్టాయి. గ్రాఫ్ పనిచేయని పరిస్థితి నెలకొంది. సదాశయంతో లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసినా పట్టించుకునే నాథుడు లేక నిరుపయోగంగా మారాయి. నీటి విడుదలలో అయోమయం.. ప్రస్తుతం తాగు, సాగునీటికి సాగర్ నీరు విడుదలతో మేజర్లకు నీటి విడుదల విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ మేజర్‌కు ఎంత నీరు విడుదల చేయాలనే విషయంలో అయోమయం నెలకొంది. గతంలో గార్డ్ గదుల్లో ఏర్పాటు చేసిన రీడింగ్ యంత్రాల ద్వారా అధికారులు ఆయా మేజర్లకు నీరు విడుదల చేసేవారు. కొన్ని మేజర్లకు నీటి సరఫరా అధికంగా ఉండగా.. మరికొన్నింటికి సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో రైతులు సాగునీటి కోసం అనధికారిక తూములు, గండ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాలువ చివరి భూముల రైతులకు సాగు నీరందక అవస్థలపాలవుతున్నారు. నీటిపారుదల విషయంలో ఎన్ఎస్పీ అధికారులు చోద్యం చూస్తున్నారని చివరి భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి కెనాల్ ఆటోమిషన్‌ను వినియోగంలోకి తెచ్చి రైతులకు నీరందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెండేళ్లుగా పనిచేయడం లేదు.. కెనాల్ ఆటో మిషన్ రెండేళ్లుగా పనిచేయడం లేదు. అక్కడక్కడ రీడింగ్ యంత్రాలను స్టోర్ రూమ్స్‌లో భద్రపరిచాం. మరికొన్ని రూమ్స్‌ను పరిశీలించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ప్రతి మేజర్‌పై గార్డు రూములు ఏర్పాటుచేస్తాం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉంది. రూముల్లో దొంగిలించిన యంత్రాలపై ఇప్పటికే 20–30 కేసులు నమోదు చేశాం. అయినా ఫలితం లేదు. – వాసంతి, ఎన్ఎస్పీ ఈఈ -
కొత్తగా 12 డిస్టలరీలు ఏర్పాటు
నరసాపురం : మన రాష్ట్రంలో అవసరాలకు తగిన విధంగా మద్యం ఉత్పత్తి జరగడం లేదని రాష్ట్ర ఎక్సైజŒ æశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం నరసాపురం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 12 డిస్టలరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుం ఉన్న 4 డిస్టలరీల ద్వారా ఉత్పత్తి అవుతున్న మద్యం, డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. కొత్త డిస్టలరీల ఏర్పాటుతో కొంతమేర ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయన్నారు. రాష్ట్రంలో నాటు సారా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా గ్రామాల్లో దాడులు చేయడం, నాటుసారా వ్యాపారులు తయారీదారుల్లో పరివర్తన తీసుకొచ్చే కార్యక్రమాలు, సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్పర్సన్ పి.రత్నమాల పాల్గొన్నారు. -
కొత్తగా 12 డిస్టలరీలు ఏర్పాటు
నరసాపురం : మన రాష్ట్రంలో అవసరాలకు తగిన విధంగా మద్యం ఉత్పత్తి జరగడం లేదని రాష్ట్ర ఎక్సైజŒ æశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం నరసాపురం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా 12 డిస్టలరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రస్తుం ఉన్న 4 డిస్టలరీల ద్వారా ఉత్పత్తి అవుతున్న మద్యం, డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేకపోతున్నాయని చెప్పారు. కొత్త డిస్టలరీల ఏర్పాటుతో కొంతమేర ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయన్నారు. రాష్ట్రంలో నాటు సారా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా గ్రామాల్లో దాడులు చేయడం, నాటుసారా వ్యాపారులు తయారీదారుల్లో పరివర్తన తీసుకొచ్చే కార్యక్రమాలు, సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్పర్సన్ పి.రత్నమాల పాల్గొన్నారు. -
వ్యాపారాభివృద్ధికి శిక్షణ దోహదం
నరసాపురం రూరల్: మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా లేసు అల్లికల మహిళలను తీర్చిదిద్దేందుకు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని హస్తకళల అభివద్ధి అధికారి లంక మనోజ్ అన్నారు. మండలంలోని రుస్తుంబాద గ్రామంలోని ఇంటర్నేషనల్ లేసు ట్రేడ్ సెంటర్లో ‘వ్యాపారవేత్తలుగా ఎదగడం ఎలా’ అంశంపై శిక్షణను మంగళవారం ఆయన ప్రారంభించారు. న్యూఢిల్లీకి చెందిన ఈపీసీహెచ్, కేంద్ర హస్తకళల అభివద్ధి కమిషన్ సహకారంతో ఈనెల 20వ తేదీ వరకు శిక్షణ నిర్వహిస్తామని ఐఎల్‌టీసీ ప్రోగ్రాం ఆఫీసర్ రాహుల్ రంజన్ తెలిపారు. ప్రస్తుతం రెండు బ్యాచ్‌లకు శిక్షణ ప్రారంబించామన్నారు. మొత్తం 14 బ్యాచ్‌ల ద్వారా 280 మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. నరసాపురం ప్రాంత లేసు అల్లికలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతో ఆధునిక అవసరాలకు అనుగుణంగా అల్లికలను రూపుదిద్దేందుకు శిక్షణలు దోహదపడతాయన్నారు. పూర్తిస్థాయి శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం హస్త కళల అభివద్ధికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని అల్లికా మహిళలు గుర్తించి శిక్షణ పారదర్శకంగా పొందాలని వారు సూచించారు. ఐఎల్‌టీసీ కన్వీనర్ కలవకొలను తులసీరావు, శిక్షకుడు, వైఎన్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఎం.సత్యనారాయణ (ఎంఎస్ఎన్), ఏసురాముడు, దివాకర్, రాహుల్ పాల్గొన్నారు. -
గోదావరి తల్లికి కోటిదండాలు
పర్వతాల వంటి పాపాలను సైతం ప్రక్షాళన గావించే పుణ్యగంగ.. చరిత్ర ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాలతో అలరారే ఘనతరంగ.. బీడు భూముల్లో బంగారం పండించే జలధితరంగ.. మా గోదావరి తల్లీ.. నీకు కోటి దండాలు.. కొవ్వూరు: గోదావరి అంత్య పుష్కరాల పుణ్య స్నానాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గోష్పాదక్షేత్రం ఘాట్‌లో 11వ రోజు బుధవారం భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి వరద ఉధృతి కొనసాగడంతో క్షేత్రంలోని పోలీసులు మొదటి రెండు ఘాట్లలో స్నానాలకు అనుమతించలేదు. నూతన ఘాట్‌లో సుమారు 30 వేల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరించారు. ఒడిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పిండ ప్రదానాలు అధిక సంఖ్యలో చేశారు. తాళ్లపూడి, కొవ్వూరు మండలాల పరిధిలోని రూరల్ ఘాట్‌ల్లో ఇరవై వేల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. గురువారంతో అంత్య పుష్కరాలు ముగియనుండడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి గోష్పాదక్షేత్రంలో సభ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చే స్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవోల పేరుతో పుష్కర వీడ్కోలు కార్యక్రమంపై పలువురికి ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారు. నరసాపురం జన గోదావరి నరసాపురం : నరసాపురం జన గోదావరిగా మారిపోయింది. అంత్యపుష్కర పర్వం చివరిదశకు చేరుకోవడంతో భక్తులు పోటెత్తారు. 11వ రోజు బుధవారం ఘాట్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. వలంధర్‌రేవులో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కనిపించింది. అధికారుల అంచనా ప్రకారం 20 వేల మంది స్నానాలు చేశారు. గోదావరి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్నానాలు అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వలంధరరేవులో ఏర్పాటు చేసిన జల్లుస్నానం ప్రత్యే ఆకర్షణగా నిలిచింది. ఎక్కువ మంది భక్తులు, జల్లు స్నానాలు చేయడానికి మొగ్గు చూపారు. పిండ ప్రదానాలు చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. మరోవైపు భక్తుల సంఖ్య పెరగడంతో ఏర్పాట్లలో లోపాలు కనిపిస్తున్నాయి. సిబ్బంది మొత్తం కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లడంతో బందోబస్తుతో సహా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఘాట్ల వద్ద మంచినీరు సరఫరా వంటి లోపాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అమ్మ గర్భంలోనే అంతం చేశారు..
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో భ్రూణ హత్యలు చోటు చేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున నిత్యం రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ అతిథిగృహం ముందు రోడ్డుపై రెండు పిండాలు ప్లాస్టిక్ కవర్లో పడి ఉన్నాయి. వాటితో పాటు ఆస్పత్రుల్లో ఉపయోగించే గ్లౌజ్‌లు, ఇంజెక్షన్ల కవర్లు ఉన్నాయి. ఉదయం 6.30 గంటలకు వాకింగ్‌కు వెళ్లిన వారు చూసి పక్కనే ఉన్న టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా డిప్యూటీ డీఎంహెచ్ఓ కృష్ణకుమారి పరిశీలించి మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో నెలలు నిండని పిండాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా వైద్యాధికారి భానుప్రసాద్ నాయక్, ఫోరెన్స్ నిపుణులు బాలనరేందర్లు ఏరియా ఆస్పత్రిలో ఉన్న నెలలు నిండని పిండాలను పరిశీలించారు. రెండు పిండాలు కూడా ఆడ శిశువులని, ఐదు నెలలలోపు ఉన్న పిండాలుగా గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం పోలీసుల సహకారంతో వైద్యాధికారులు పట్టణంలో అనుమానంలో ఉన్న మూడు ప్రైవేట్ ఆస్పత్రులు శ్వేత నర్సింగ్ హోం, శ్రీదేవి నర్సింగ్‌హోం, లక్ష్మీసాయి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఓపీ విభాగం, ఆపరేషన్ల రికార్డులు పరిశీలించారు. బ్రూణహత్యలపై దర్యాప్తు చేస్తున్నామని నిందితులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కొనసాగుతున్న హరితహారం
హుజూర్నగర్ : హరితహారంలో భాగంగా పట్టణంలో సోమవారం పడిగరాయిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవాలయం సమీపంలో ఎన్ఎస్పీ కాల్వ కట్టపై అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. పట్టణంలోని 9, 11 వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ రవి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఎన్ఎస్పీ ఏఈలు నరేష్, మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్లు కోటయ్య, వెంకటేశ్వర్లు, ఉపేందర్, కౌన్సిలర్లు రవినాయక్, పుల్లయ్య, కిరణ్‌కుమార్, నాయకులు కామిశెట్టి రవికుమార్, ఉప్పల విజయలక్ష్మి, కుక్కడపు కాశయ్య, వీరభద్రం, కృష్ణారెడ్డి, సైదులునాయక్, కృష్ణ, బాబూరావు, యోహాన్, చంటి పాల్గొన్నారు. -
'పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ఎస్పీ క్వార్టర్స్ ఖాళీ'
నల్గొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పీ) క్వార్టర్స్‌లో అనధికారికంగా నివసిస్తున్న మాజీ ఉద్యోగులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారం ఉదయం అధికారులు ...పోలీసు బందోబస్తు మధ్య ఖాళీ చేయిస్తున్నారు. కాగా నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో ఉద్యోగుల సౌలభ్యం కోసం ఎన్ఎస్పీ క్వార్టర్స్ నిర్మించారు. అయితే కాలక్రమేణా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు లీజు పేరుతో వాటిని ఆక్రమించుకున్నారు. దీనిపై 2009లో లోకాయుక్తలో కేసు నమోదైంది. గతేడాది ఆగస్టు 1న ఉపలోకాయుక్త కృష్ణాజీరావు క్వార్టర్స్‌ను పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ, సాగర్ చీఫ్ ఇంజినీరుతో కమిటీ ఏర్పాటు చేశారు. క్వార్టర్స్ వ్యవహారంపై సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. లోకాయుక్త ఆదేశాలు బేఖాతరు చేసిన అప్పటి జిల్లా ఎస్పీకి అరెస్ట్ వారెంట్ సైతం జారీచేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఫలితంగా గత ఏడాది మార్చి 20న మొదటి విడతగా పదిమంది రాజకీయ నాయకుల క్వార్టర్స్‌ను ఖాళీ చేయించారు. కాగా మిగిలిన క్వార్టర్స్ లో ఉన్న మాజీ ఉద్యోగులను ఇవాళ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.