అమ్మ గర్భంలోనే అంతం చేశారు.. | Heavy in Fetal murders! | Sakshi
Sakshi News home page

అమ్మ గర్భంలోనే అంతం చేశారు..

Published Fri, Aug 5 2016 2:44 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM

అమ్మ గర్భంలోనే అంతం చేశారు.. - Sakshi

అమ్మ గర్భంలోనే అంతం చేశారు..

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో భ్రూణ హత్యలు చోటు చేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున నిత్యం రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్పీ అతిథిగృహం ముందు రోడ్డుపై రెండు పిండాలు ప్లాస్టిక్ కవర్‌లో పడి ఉన్నాయి. వాటితో పాటు ఆస్పత్రుల్లో ఉపయోగించే గ్లౌజ్‌లు, ఇంజెక్షన్ల కవర్లు ఉన్నాయి. ఉదయం 6.30 గంటలకు వాకింగ్‌కు వెళ్లిన వారు చూసి పక్కనే ఉన్న టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కృష్ణకుమారి పరిశీలించి మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో నెలలు నిండని పిండాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు.

జిల్లా వైద్యాధికారి భానుప్రసాద్ నాయక్, ఫోరెన్స్ నిపుణులు బాలనరేందర్‌లు ఏరియా ఆస్పత్రిలో ఉన్న నెలలు నిండని పిండాలను పరిశీలించారు. రెండు పిండాలు కూడా ఆడ శిశువులని, ఐదు నెలలలోపు ఉన్న పిండాలుగా గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం పోలీసుల సహకారంతో వైద్యాధికారులు పట్టణంలో అనుమానంలో ఉన్న మూడు ప్రైవేట్ ఆస్పత్రులు శ్వేత నర్సింగ్ హోం, శ్రీదేవి నర్సింగ్‌హోం, లక్ష్మీసాయి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఓపీ విభాగం, ఆపరేషన్ల రికార్డులు పరిశీలించారు. బ్రూణహత్యలపై దర్యాప్తు చేస్తున్నామని నిందితులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement