పశ్చిమ డెల్టాకు 6 వేల క్యూసెక్కులు
Published Sun, Oct 23 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
కొవ్వూరు : జిల్లాలో వ్యవసాయ పంటల అవసరాల నిమిత్తం పశ్చిమ డెల్టా కాలువకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం ఉదయం 6 గంటలకు 38,444 క్యూసెక్కులున్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి 32,112 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో 11,800 క్యూసెక్కుల నీటిని ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. మిగిలిన 20,319 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
Advertisement
Advertisement