గూడెంలో పసుపు కొనుగోలు కేంద్రం
గూడెంలో పసుపు కొనుగోలు కేంద్రం
Published Sun, May 28 2017 12:07 AM | Last Updated on Sat, Apr 6 2019 9:37 PM
తాడేపల్లిగూడెం : పసుపు రైతుల సమస్యను పరిష్కరించేందుకు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. జిల్లాలోని పసుపు రైతులు తమ సమస్యలపై మంత్రికి శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాలతో పాటు ఆచంట. పెనుగొండ మండలాల్లో రైతులు పసుపు పండిస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రితో మాట్లాడినట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఏఎంసీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమాన పనికి సమానవేతనం రావడంలేదని 108 అంబులె న్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జీవీకే సంస్థ నుంచి లీవ్‌ఎన్ క్యాష్‌మెంట్ సొమ్ములు రాక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సమస్యపై సీఎంతో మాట్లాడి అంబులె న్స్ సిబ్బందికి న్యాయం చేస్తామన్నారు.
గోవధ నిరోధక చట్టం సంచలనం
కేంద్రం తీసుకువచ్చిన గోవధ నిరోధక చట్టం సంచలనమని ఇలాంటి చట్టాన్ని తీసుకొచి్చన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలో ఉండే అత్యధిక శాతం హిందువులు భగవంతునితో సమానంగా గోవును పూజిస్తారన్నారు. మోపురం ఉన్న దేశీయ ఆవుల పాల నుంచి తయారుచేసిన పదార్థాలలో రోగనిరోధకశక్తితో పాటు అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్నాయని ప్రపంచం గుర్తించిదన్నారు. గత పాలకులు పిరికితనం, నిర్లక్ష్యం కారణంగా గోవులు కబేళాలకు తరలిపోతున్నాయన్నారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారం కోసం నందమూరులో ఎర్రకాలువపై ఉన్న పాత అక్విడెక్ట్‌ను తొలగించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందన్నారు.
Advertisement