in tadepalligudem
-
గూడెంలో పసుపు కొనుగోలు కేంద్రం
తాడేపల్లిగూడెం : పసుపు రైతుల సమస్యను పరిష్కరించేందుకు తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెప్పారు. జిల్లాలోని పసుపు రైతులు తమ సమస్యలపై మంత్రికి శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలాలతో పాటు ఆచంట. పెనుగొండ మండలాల్లో రైతులు పసుపు పండిస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రితో మాట్లాడినట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ఏఎంసీలో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమాన పనికి సమానవేతనం రావడంలేదని 108 అంబులె న్స్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జీవీకే సంస్థ నుంచి లీవ్‌ఎన్ క్యాష్మెంట్ సొమ్ములు రాక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ సమస్యపై సీఎంతో మాట్లాడి అంబులె న్స్ సిబ్బందికి న్యాయం చేస్తామన్నారు. గోవధ నిరోధక చట్టం సంచలనం కేంద్రం తీసుకువచ్చిన గోవధ నిరోధక చట్టం సంచలనమని ఇలాంటి చట్టాన్ని తీసుకొచి్చన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు మంత్రి తెలిపారు. దేశంలో ఉండే అత్యధిక శాతం హిందువులు భగవంతునితో సమానంగా గోవును పూజిస్తారన్నారు. మోపురం ఉన్న దేశీయ ఆవుల పాల నుంచి తయారుచేసిన పదార్థాలలో రోగనిరోధకశక్తితో పాటు అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్నాయని ప్రపంచం గుర్తించిదన్నారు. గత పాలకులు పిరికితనం, నిర్లక్ష్యం కారణంగా గోవులు కబేళాలకు తరలిపోతున్నాయన్నారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారం కోసం నందమూరులో ఎర్రకాలువపై ఉన్న పాత అక్విడెక్ట్‌ను తొలగించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందన్నారు. -
అలరించిన ఏకపాత్రాభినయ పోటీలు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) : పట్టణ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో పద్మశ్రీ రేలంగి అండ్ టీఆర్ త్యాగరాజు స్మారక 4వ జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతల వివరాలను పరిషత్ నిర్వాహకులు, రచయిత, దర్శకుడు కోపల్లె శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. పౌరాణిక విభాగంలో మంగిన నాగమణి(తణుకు) చంద్రమతి పాత్రధారిణిగా ప్రథమ బహుమతి సాధించారు. కైల వెంకటేశ్వర్లు (ఒంగోలు) ద్వితీయ బహుమతి, ఎస్.ఏ.హమీద్ (ఏలూరు) తృతీయ బహుమతి అందుకున్నారు. బి.త్రినా«థరాజు, గుంటుపల్లి వీరాంజనేయ చౌదరి, గుండా మురళీకృష్ణ, హనుమంత పెద్ది రాజు కన్సోలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు. చారిత్రక–సాంఘిక విభాగంలో గిరిజన వెంకటరత్నం (బుట్టయ్యగూడెం కాలనీ) వీరపాండ్య కట్ట బ్రహ్మన పాత్రధారిగా మొదటి బహుమతి సాధించగా, ఇనుమలు వెంకటేశ్వర్లు (పాలకొల్లు), ఆలీ (నరసాపురం) ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. కన్సోలేషన్ బహుమతులు పొదిలి నాగేంద్ర ప్రసాద్, నడింపల్లి రాజగోపాలరాజు, కె.లాల్ నెహ్రు అందుకున్నారు. విశిష్ట సత్కార గ్రహీత ప్రదర్శన జి.సాంబశివరావు (హైదరాబాద్) రారాజు పాత్రధారి అందుకున్నారు. బాల భవిత ప్రదర్శనలో దంపూరి మారుతీ కృష్ణ మనోహర్‌కు ప్రశంస బహుమతి అందించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా గొర్తి మురళీ కృష్ణ సిద్ధాంతి, రాజా తాతాయ్య, అడ్డగర్లు వెంకటేశ్వర్లు వ్యవహరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. -
కపిల్ చిట్స్‌లో చోరీకి యత్నం
తాడేపల్లిగూడెం రూరల్ : కపిల్ చిట్స్ తాడేపల్లిగూడెం శాఖ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. కార్యాలయం దొడ్డిదారిన మెట్లకు వేసిన గ్రిల్ తాళాలు, కార్యాలయం సందులో ఉన్న డోర్‡ తాళాలు పగులగొట్టి నిందితుడు లోపలికి ప్రవేశించాడు. మేనేజర్ రూమ్‌లోని లాకర్ తాళం తీసేందుకు యత్నించాడు. అది రాకపోవడంతో ఐదు సీసీ కెమెరాలతో ఉడాయించాడు. మంగళవారం ఉదయం కార్యాలయాన్ని తెరిచేందుకు వచ్చిన బ్రాంచ్ మేనేజర్ షేక్ జానీ బాషా సందులోని తలుపు తీసి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఎం.సూర్యభగవాన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కార్యాలయం లాకరులోని నగదు సేఫ్‌గా ఉండటంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ షేక్ జానీ బాషా ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.