కపిల్‌ చిట్స్‌లో చోరీకి యత్నం | try to robbry in kapil chits | Sakshi
Sakshi News home page

కపిల్‌ చిట్స్‌లో చోరీకి యత్నం

Published Tue, Jul 26 2016 8:58 PM | Last Updated on Sun, Sep 2 2018 3:57 PM

కపిల్‌ చిట్స్‌లో చోరీకి యత్నం - Sakshi

కపిల్‌ చిట్స్‌లో చోరీకి యత్నం

తాడేపల్లిగూడెం రూరల్‌ : కపిల్‌ చిట్స్‌ తాడేపల్లిగూడెం శాఖ కార్యాలయంలో గుర్తు తెలియని దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు.  కార్యాలయం  దొడ్డిదారిన మెట్లకు వేసిన గ్రిల్‌ తాళాలు, కార్యాలయం సందులో ఉన్న డోర్‌‡ తాళాలు పగులగొట్టి నిందితుడు లోపలికి ప్రవేశించాడు. మేనేజర్‌ రూమ్‌లోని లాకర్‌ తాళం తీసేందుకు యత్నించాడు.  అది రాకపోవడంతో ఐదు సీసీ కెమెరాలతో ఉడాయించాడు. మంగళవారం ఉదయం కార్యాలయాన్ని తెరిచేందుకు వచ్చిన  బ్రాంచ్‌ మేనేజర్‌ షేక్‌ జానీ బాషా సందులోని తలుపు తీసి ఉండటాన్ని గుర్తించారు. దీంతో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ ఎం.సూర్యభగవాన్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కార్యాలయం లాకరులోని నగదు సేఫ్‌గా ఉండటంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బ్రాంచ్‌ మేనేజర్‌ షేక్‌ జానీ బాషా ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.సూర్యభగవాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement