కాళ్లకూరు వెంకన్నకు బంగారు పుష్పాలు సమర్పణ
కాళ్ల : కాళ్లకూరులో స్వయంభువుడిగా కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తులు శనివారం బంగారు పుష్పాలు సమర్పించారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన చేకూరి అప్పలరాజు, సుశీల దంపతులు స్వామికి 54 గ్రాముల బరువైన 108 బంగారు పుష్పాలు సమర్పించారు. కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు భక్తులను అభినందించారు. స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు.