శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాల వెల్లువ
Published Sat, Jun 10 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
దేవరపల్లి(ద్వారకాతిరుమల): ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఇద్దరు భక్తులు రూ.2.01లక్షలను విరాళంగా అందించారు. నిడమర్రు మండలం చిన నిండ్రకొలనుకు చెందిన పాతపాటి వెంకట రామలింగరాజు, పద్మ దంపతులు రూ.1,00,116లను అందించారు. అలాగే ఉండి మండలం యండగండికి చెందిన వేగేశ్న సత్తిరాజు, సూర్యకాంతమ్మ దంపతులు రూ.1,01,116లను అందించారు. ఈవో వేండ్ర త్రినాథరావు దాతల కుటుంబాలకు ఉచిత దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వారికి ప్రసాదాలు అందించారు.
Advertisement
Advertisement