మద్ది అంజన్న సన్నిధిలో దిల్‌రాజు | dilraju comes to maddi temple | Sakshi
Sakshi News home page

మద్ది అంజన్న సన్నిధిలో దిల్‌రాజు

Published Sat, Sep 17 2016 10:33 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

మద్ది అంజన్న సన్నిధిలో దిల్‌రాజు - Sakshi

మద్ది అంజన్న సన్నిధిలో దిల్‌రాజు

జంగారెడ్డిగూడెం రూరల్‌ : సినీనటుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన సుప్రీమ్‌ సినిమా విజయవంతం కావడంతో మద్ది ఆంజనేయస్వామి దర్శించుకున్నామని సినీ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని శనివారం రాత్రి నిర్మాత దిల్‌ రాజు, సుప్రీమ్‌ సినిమా దర్శకులు అనిల్‌ రావిపూడి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దిల్‌ రాజు విలేకరులతో మాట్లాడుతూ సుప్రీమ్‌ సినిమా రిలీజ్‌కు ముందు మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని సినిమా సూపర్‌ హిట్‌ కావాలని మొక్కుకున్నామని తెలిపారు.  ఇక నుంచి ప్రతి సినిమాకు ముందు ద్వారకాతిరుమలతో పాటు మద్ది క్షేత్రాన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ సుప్రీమ్‌ సినిమా హిట్‌ చేసి మద్ది ఆంజనేయస్వామి తన మహిమ చూపినట్టు పేర్కొన్నారు. దిల్‌రాజు, అనిల్‌ను ఆలయ చైర్మన్‌ దుశ్శాలువాతో సత్కరించారు. ఈవో పెన్మెత్స విశ్వనా«థరాజు స్వామి వారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేశారు. ఆదిత్య ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఎల్‌వీఆర్, స్థానిక ఎగ్జిబ్యూటర్‌ కొండూరి అంజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement