మావుళ్లమ్మ సన్నిధిలో వరుణ్ సందేశ్
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారిని సినీ హీరో వరుణ్‌సందేశ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బీజేపీ నేత కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక వెంకటేశ్వర బుక్స్ అండ్ స్టేషనరీ యజమాని ప్రసాద్ ఎల్‌జీ 43 అంగుళాల ఎల్‌ఈడీ టీవీను ఆలయానికి బహూకరించారు. పాలకొల్లుకు చెందిన గుర్రం అమరకృష్ణ, ఫణి సత్యవతి 5 గ్రాములు, కొత్తపల్లి సూర్యప్రకాష్ (లాలు) 4 గ్రాములు, తటవర్తి పురుషోత్తం గుప్త, తారా దంపతులు 3.660 గ్రాముల బంగారం విరాళంగా సమర్పించారు.