పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు
పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు
Published Sat, Mar 25 2017 9:35 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బాలభోగ నివేదన, తీర్థప్రసాదగోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు జంగారెడ్డిగూడేనికి చెందిన మానికల వేంటేశ్వరరావు, దుర్గ దంపతులు, చింతపల్లి బాలకృష్ణ, చాందిని దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, సభ్యులు పొన్నాడ సత్యనారాయణ, గొట్టుముక్కల రాయపరాజు, అన్నప్రగడ వీరరాఘవులు, బోడ వేంకటేశ్వరరావు, మారిశెట్టి బాలకృష్ణ, యిళ్ల రామ్మోహనరావు, తోట రామకృష్ణ, అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Advertisement
Advertisement