దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని సదుపాయాలు కల్పించింది. నోట్ల మార్పిడిలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవకుండా వచ్చే శని, ఆదివారాల్లోనూ (వాస్తవానికి రెండవ శనివారం బ్యాంకులకు సెలవు) బ్యాంకులు పనిచేసేలా ఆదేశాలు జారీచేసింది. ప్రజల తాకిడిని దృష్టిలో పెట్టుకొని వచ్చే శని, ఆదివారాల్లో బ్యాంకులు ఫుల్‌డే పనిచేసేలా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతోపాటు నేడు, రేపు (గురు, శుక్రవారాల్లోనూ) సాధారణం కంటే ఎక్కువ సమయం బ్యాంకులు పనిచేయాలని ఆదేశించింది.