వాదాలకుంట (గోపాలపురం): టీడీపీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోకుండా కేవలం ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అభివద్ధి, సంక్షేమాలను అందిస్తున్నారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు విమర్శించారు. మండలంలోని వాదాలకుంటలో శనివారం జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి తలారి వెంకట్రావు పార్టీ కండువాలు వేసి ఆ
వాదాలకుంట (గోపాలపురం): టీడీపీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోకుండా కేవలం ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అభివద్ధి, సంక్షేమాలను అందిస్తున్నారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు విమర్శించారు. మండలంలోని వాదాలకుంటలో శనివారం జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి తలారి వెంకట్రావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు విసుగు చెందారన్నారు. రాబోయే రోజుల్లో జగన్ నాయకత్వంలో పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీలోకి చేరిన వారిలో ఇంజే నాగశ్రీనివాసరావు, దౌలూరి చిన వెంకటరావు, రాపాక చిన వెంకయ్య, ఏలిపిన వీర్రాజు, బెల్లపు ఏసురత్నం, ఏలిపిన నాగేశ్వరావు, దౌలూరి గంగరాజు, చింతల వెంకటేశు, పల్లంట్ల చినవెంకటేశు, బొందారాముడు, పెనుమాల దుర్గారావు, పొన్నాటి నరసింహారావు ఉన్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు, సొసైటీ అధ్యక్షుడు వుండవల్లి సత్యనారాయణ (చిన్నబ్బులు), గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉప్పలపాటి నాగేశ్వరావు, దుగ్గిరాల వీరరాఘవులు, మండల సేవాదళ్ అధ్యక్షుడు కొడమంచిలి విజయ్‌కుమార్, ఖండవల్లి సురేష్, జొన్నకూటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.