రేపటి నుంచి జాతీయస్థాయి కబడ్డీ పోటీలు | from tommorow national level kabaddi games | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

Published Fri, Jan 13 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

from tommorow national level kabaddi games

నరసాపురం : స్థానిక రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో శనివారం నుంచి 18వ తేదీ వరకూ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం దేశవ్యాప్తంగా 25 జట్లు పోటీలకు హాజరుకానున్నాయని గురువారం విలేకరుల సమావేశంలో పోటీల కన్వీనర్‌ కొత్తపల్లి జానకీరామ్‌ తెలిపారు. కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం.రంగారావు మాట్లాడుతూ ఇండియా తరఫున ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ల్లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఆంధ్రా జట్టు మహిళా క్రీడాకారిణులు కె.గౌరి, కె.గాయత్రి, కేఎన్‌వీ దుర్గ ఈ ఏడాది మ్యాచ్‌లకు అదనపు ఆకర్షణగా ఉంటారని చెప్పారు. ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందే జట్లకు రూ 5 లక్షలు ప్రైజ్‌మనీ అందిస్తామన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement