మత్స్యకార సొసైటీలకు రుణాలు
ఆకివీడు: జిల్లాలో మత్స్యకారుల వ్యాపార తోడ్పాటుకు రుణాలు అందజేయనున్నామని డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం తెలిపారు. స్థానిక రూరల్ బ్యాంక్ ఆవరణలో శనివారం మత్స్యకారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఆకివీడు: జిల్లాలో మత్స్యకారుల వ్యాపార తోడ్పాటుకు రుణాలు అందజేయనున్నామని డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం తెలిపారు. స్థానిక రూరల్ బ్యాంక్ ఆవరణలో శనివారం మత్స్యకారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మత్స్యకారులు సొసైటీలుగా ఏర్పడితే సమగ్ర సహకార అభివృద్ధి పథకం(ఐసీడీపీ) ద్వారా సబ్సిడీతో కూడిన రూ.లక్ష రుణం అందజేస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లాలో రూ.30 లక్షలు రుణాలుగా అందజేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. మత్స్యకారులు వ్యాపార నిమిత్తం రుణాన్ని వినియోగించుకోవాలని కోరారు. రుణంలో రూ.20 వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు అండ్రాజు చల్లారావు మాట్లాడుతూ గతంలో మత్స్యకార సొసైటీలకు రుణాలు మంజూరుచేసేందుకు నిధులు విడుదల కాగా బీ–క్లాస్ సొసైటీలు ఉన్నందున వెనక్కి Ðð ళ్లిపోయాయన్నారు. నాబార్డు ద్వారా ఆ నిధులను మళ్లీ రాబట్టి డీసీసీబీ ద్వారా ఇచ్చేందుకు చైర్మన్ రత్నం అంగీకరించడం అభినందనీయమన్నారు. జిల్లాలో 250 మత్స్యకార సొసైటీలు ఉన్నాయని వాటిని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు కొప్పనాతి నర్సింహరావు, బి.మధుసూదన రావు, బి.ఏడుకొండలు, అండ్రాజు రామన్న, డీసీసీబీ డైరెక్టర్ విజయ నర్సింహరావు, ఐసీడీపీ అధికారులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.