మోటార్ సైకిల్ దగ్ధం
ఎర్రకాలువ సమీపంలో, శనివారం, షార్ట్ సర్క్యూట్
near red canal, saturday, short circuit
టి.నరసాపురం: టి.నరసాపురం ఎర్రకాలువ సమీపంలో శనివారం వేకువజాము ఐదు గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో మోటార్ సైకిల్ దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం ఏపుగూడెం పంచాయతీ పరిధిలోని కన్నప్పగూడెంకు చెందిన పాయం కిరణ్ మరో యువకుడు కలిసి చింతలపూడి మండలం కొమ్ముగూడెం బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నారు. మార్గమధ్యంలో ఎర్రకాలువ సమీపంలో రోడ్డుపై వ్యవసాయ మోటార్లకు వెళ్లే విద్యుత్ తీగ తెగిపడి ఉంది. దీనిని చూడకుండా కిరణ్ బైక్‌పై వెళుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డారు. వీరిద్దరికీ తృటిలో ప్రమాదం తప్పగా, బైక్ పూర్తిగా కాలిబూడిదైంది.