శనీశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు | mandapalli temple | Sakshi
Sakshi News home page

శనీశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Published Sat, Nov 12 2016 9:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

mandapalli temple

మందపల్లి (కొత్తపేట) :
శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా కొత్తపేట మండలం మందపల్లి ఉమా మందేశ్వర క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శనివారం త్రయోదశి తిధి కలిసి రావడం, శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి, తైలాభిషేకం జరిపితే శనిదోషం తొలగుతుందని భక్తుల విశ్వాçÜం. ప్రసిద్ధి చెందిన ఈ శనీశ్వర క్షేత్రానికి శుక్రవారం రాత్రి నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.  దేవస్థానం పాలక మండలి చైర్మ¯ŒS బండారు సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ వెత్సా దేముళ్ళు పర్యవేక్షణలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. స్వామివారికి రూ.10,89,969 ఆదాయం వచ్చినట్టు ఏసీ అండ్‌ ఈఓ దేముళ్ళు తెలిపారు. పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement