శనీశ్వర క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
మందపల్లి (కొత్తపేట) :
శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా కొత్తపేట మండలం మందపల్లి ఉమా మందేశ్వర క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శనివారం త్రయోదశి తిధి కలిసి రావడం, శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి, తైలాభిషేకం జరిపితే శనిదోషం తొలగుతుందని భక్తుల విశ్వాçÜం. ప్రసిద్ధి చెందిన ఈ శనీశ్వర క్షేత్రానికి శుక్రవారం రాత్రి నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దేవస్థానం పాలక మండలి చైర్మ¯ŒS బండారు సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెత్సా దేముళ్ళు పర్యవేక్షణలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. స్వామివారికి రూ.10,89,969 ఆదాయం వచ్చినట్టు ఏసీ అండ్ ఈఓ దేముళ్ళు తెలిపారు. పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందించారు.