మహిళా క్రికెట్ జిల్లా జట్టు ఎంపిక
దుద్దుకూరు (దేవరపల్లి) : దేవరపల్లి మండలం దుద్దుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం మహిళా క్రికెట్ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ఐదు పాఠశాలల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జట్టు కెప్టెన్‌గా ఎస్.శైలజదేవి(దుద్దుకూరు), వైస్ కెప్టెన్‌గా ఒ.హేమ ఎంపికయ్యారు. ఎస్.ప్రసన్న(దేవరపల్లి), ఎస్. మంజు(దేవరపల్లి); పి.యామిని(దుద్దుకూరు), టి.సౌజన్య(దేవరపల్లి), ఎన్.రమణ(గూటాల), పి. నాగదేవి(గూటాల), కె.బ్లెసీ(గూటాల), ఎం.శిరీష్(దుద్దుకూరు), టి.రమ్య(దేవరపల్లి), యు.రమ్య(దేవరపల్లి), ఎం.సుధశ్రీ(దుద్దుకూరు), ఎం.సంధ్యారాణి(దుద్దుకూరు), ఎం.అనూష(దుద్దుకూరు) జిల్లా జట్టుకు ఎంపికైనట్టు పీఈటీ ఓరుగంటి కృష్ణంరాజు తెలిపారు. క్రీడాకారులను ప్రధానోపాధ్యాయులు డి.ఎస్. సుబ్రహ్మణ్యం, సర్పంచ్ సౌదామణి, పీఈటీలు వి.ఎం.కల్యాణ్ కుమార్, వి.ప్రవీణ, వి.రమాదేవి, కె.వి.డి.వి.ప్రసాద్ అభినం«దించారు.