ప్రజ్ఞానంద, గుకేశ్‌ గేమ్‌ ‘డ్రా’ | Pragnananda And Gukesh Match Draw In Sinquefield Cup Classical Chess Tournament | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞానంద, గుకేశ్‌ గేమ్‌ ‘డ్రా’

Published Fri, Aug 23 2024 9:04 AM | Last Updated on Fri, Aug 23 2024 2:46 PM

Pragnananda And Gukesh Match Draw In Sinquefield Cup Classical Chess Tournament

సెయింట్‌ లూయిస్‌: సింక్‌ఫీల్డ్‌ కప్‌ క్లాసికల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్‌ వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన మూడో గేమ్‌ 62 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద కాటాలాన్‌ ఓపెనింగ్‌తో గేమ్‌ను ప్రారంభించాడు.

మరోవైపు గుకేశ్‌ తొలి నాలుగు నిమిషాల్లోనే 18 ఎత్తులు పూర్తి చేయగా... ఆచితూచి ఆడిన ప్రజ్ఞానంద 18 ఎత్తులకు ఒక గంట సమయం తీసుకున్నాడు. 34వ ఎత్తుల్లో గుకేశ్‌ తప్పిదం కారణంగా ప్రజ్ఞానందకు గెలుపు దారులు తెరుచుకున్నాయి. అయితే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవడంలో ప్రజ్ఞానంద విఫలమయ్యాడు.

చివరకు ఇద్దరూ గేమ్‌ను ‘డ్రా’గా ముగించేందుకు అంగీకరించారు. మూడో రౌండ్‌ తర్వాత గుకేశ్, ప్రజ్ఞానంద ఖాతాలో 1.5 పాయింట్లు ఉన్నాయి. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా గుకేశ్‌ నాలుగో ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద ఏడో ర్యాంక్‌లో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement