chennai fc
-
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
Indian Super League 2021: పరాజయంతో మొదలు
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ తాజా సీజన్‌ను హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఓటమితో ఆరంభించింది. ఇక్కడి జీఎంసీ అథ్లెటిక్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0–1 గోల్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీ చేతిలో పరాజయంపాలైంది. చెన్నైయిన్ తరఫున వ్లాగిమిర్ కొమన్ (66వ నిమిషంలో) పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆరంభించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదిస్తూ చెన్నైయిన్ ‘డి’ బాక్స్‌లోకి పదే పదే చొచ్చుకొచ్చింది. అయితే గోల్ చేయడంలో మాత్రం సఫలం కాలేదు. చెన్నైయిన్ గోల్ కీపర్ విశాల్ కెయిత్ హైదరాబాద్ దాడులను సమర్థంగా అడ్డుకున్నాడు. అదే క్రమంలో గోల్ చేసే అవకాశాలను హైదరాబాద్ ఆటగాడు ఒగ్బెచె జారవిడిచాడు. అదే సమయంలో చెన్నైయిన్ పూర్తి రక్షణాత్మకంగా ఆడటంతో తొలి అర్ధ భాగం గోల్ లేకుండానే ముగిసింది. రెండో అర్ధ భాగంలో చెన్నైయిన్ జట్టుకు అదృష్టం కలిసొచ్చింది. హైదరాబాద్ ‘డి’ బాక్స్‌లో ఆ జట్టు ఆటగాడు హితేశ్ శర్మ ప్రత్యర్థి ప్లేయర్ అనిరుధ్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంతో రిఫరీ చెన్నైయిన్ జట్టుకు పెనాల్టీని కేటాయించాడు. ఇక్కడ ఎటువంటి పొరపాటు చేయని కొమన్ పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అనంతరం గోల్ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. -
బెంగళూరును గెలిపించిన ఛెత్రి
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలి విజయం నమోదు చేసింది. చెనైయిన్ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 56వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌గా మలిచి బెంగళూరును 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు గెలుపు బోణీ కొట్టింది. నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడతుంది. -
హైదరాబాద్ తొమ్మిదో ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తాజా సీజన్లో హైదరాబాద్ పరాజయాలకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా లేదు. శుక్రవారం ఇక్కడి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–3 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీ చేతిలో ఓడింది. దీంతో సీజన్లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. చెన్నై ఆటగాడు వాల్‌స్కీస్ (43వ, 65వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... రాఫెల్ (40వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మార్సెలినో (87వ నిమిషంలో) చేశాడు. 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఐదు పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో ఒడిశా ఎఫ్‌సీ తలపడుతుంది. -
ఐఎస్ఎల్ చాంప్ చెన్నైయిన్
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భారత క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సీ మళ్లీ మెరిసింది. ఈ లీగ్‌లో రెండోసారి టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3–2 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్‌ను గెలిపించారు. డిఫెండర్ మెల్సన్ అల్వెస్ (17వ ని., 45వ ని.) అసాధారణ ప్రదర్శనతో చెలరేగాడు. ఆట ఆరంభంలోనే భారత స్టార్ సునీల్ చెత్రి (9వ ని.) గోల్ చేసి బెంగళూరును ఆధిక్యంలో నిలబెట్టగా... ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే మెల్సన్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ద్వితీయార్ధంలో మిడ్‌ఫీల్డర్ రాఫెల్ ఆగస్టో (67వ ని.) కీలకమైన గోల్ చేయడంతో... ప్రత్యర్థి జట్టు బెంగళూరు తరఫున మికు (ఇంజూరి టైమ్ 90+2) చివరి నిమిషాల్లో గోల్ చేసినా లాభం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఐదు గోల్స్‌లో నాలుగు హెడర్ ద్వారానే వచ్చాయి. చెన్నైయిన్ జట్టు 2015 సీజన్లోనూ టైటిల్ గెలిచింది. లీగ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన అట్లెటికో డి కోల్‌కతా (2014, 2016) సరసన చేరింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్‌సీ స్టార్ సునీల్ చెత్రి ‘హీరో ఆఫ్ ద లీగ్’, గోవా ఫార్వర్డ్ ఆటగాడు ఫెర్రాన్ కొరొమినస్‌కు ‘గోల్డెన్ బూట్’, ఉదంత (బెంగళూరు) ‘పాస్ ఆఫ్ ద సీజన్’, కాల్డరన్ (చెన్నైయిన్) ‘ఫిటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’, లాల్‌రుతర (కేరళ బ్లాస్టర్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డులు అందుకున్నారు. -
ఐఎస్ఎల్-2 విజేత చెన్నైయిన్
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ లో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఎఫ్‌సీ గోవాపై 3-2తో గెలిచి చెన్నైయిన్ జట్టు కప్ కైవసం చేసుకుంది. ఐఎస్ఎల్లో కొత్త చాంపియన్ గా అవతరించింది. కొంపముంచిన సెల్ఫ్ గోల్: గోవా ఓటమిలో స్వయంకృతమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జట్టు గోల్ కీపర్ చేసిన తప్పిదంతో గోవా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. సెల్ఫ్ గోల్ గోవా కొంప ముంచింది. గోల్ కీపర్ కట్టిమణి సెల్ప్ గోల్ కొట్టడంతో గోవా కు టైటిల్ కు దూరమైంది. చెన్నైయిన్ తరపున మెండోజా, బ్రునో పెలిసారి గోల్స్ చేశారు. -
కోల్‌కతాపై చెన్నైయిన్ ఘనవిజయం
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ లీగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నైయిన్ ఎఫ్‌సీ కీలక దశలో సత్తా చూపింది. డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాతో శనివారం జరిగిన తొలి అంచె రెండో సెమీస్‌లో 3-0తో ఘన విజయం సాధించింది. దీంతో పాటు లీగ్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు నెగ్గిన తొలి జట్టుగా నిలిచింది. ఐఎస్ఎల్లో కోల్‌కతాపై చెన్నైయిన్ గెలవడం ఇదే తొలిసారి. బ్రూనో పెలిస్సారి (38వ నిమిషంలో), జేజే (57), వాలెన్సియా (68) గోల్స్ సాధించారు. ఈనెల 15న జరిగే రెండో అంచె సెమీఫైనల్లో గోవాతో ఢిల్లీ డైనమోస్ తలపడుతుంది.