బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలి విజయం నమోదు చేసింది. చెనైయిన్ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 56వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌గా మలిచి బెంగళూరును 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు గెలుపు బోణీ కొట్టింది. నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడతుంది.
Comments
Please login to add a commentAdd a comment