Bangalore FC
-
బెంగళూరు ‘హ్యాట్రిక్’ గెలుపు
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. బెంగళూరు తరఫున ఎడ్గర్ మెండెజ్ (9వ ని.లో), సురేశ్ సింగ్ (20వ ని.లో), భారత మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి (51వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఐఎస్ఎల్ చరిత్రలో సునీల్ ఛెత్రికిది 64వ గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో ఐఎస్ఎల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 63 గోల్స్‌తో బార్ట్ ఒగ్బెచె (నైజీరియా; హైదరాబాద్ ఎఫ్‌సీ) పేరిట ఉన్న రికార్డును సునీల్ ఛెత్రి అధిగమించాడు. శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీ 2–1తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. గువాహటిలో నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుతో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది. -
ఐఎస్ఎల్ విజేత ఏటీకే మోహన్ బగాన్
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టైటిల్‌ను ఏటీకే మోహన్ బగాన్ (కోల్‌కతా) ఫుట్‌బాల్ క్లబ్ తొలిసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో ఏటీకే మోహన్ బగాన్ ‘పెనాల్టీ షూటౌట్’లో 4–3తో బెంగళూరు ఎఫ్‌సీ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలోనూ స్కోరు సమంగా ఉంది. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ అనివార్యమైంది. ‘షూటౌట్’ లో మోహన్ బగాన్ తరఫున వరుసగా పెట్రాటోస్, లిస్టన్, కియాన్, మాన్వీర్ గోల్స్ చేశారు. బెంగళూరు తరఫున అలన్ కోస్టా, రాయ్ కృష్ణ, సునీల్ చెత్రి సఫలంకాగా... రమిరెస్, పెరెజ్ విఫలమయ్యారు. -
బెంగళూరును గెలిపించిన ఛెత్రి
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలి విజయం నమోదు చేసింది. చెనైయిన్ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 56వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌గా మలిచి బెంగళూరును 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు గెలుపు బోణీ కొట్టింది. నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడతుంది. -
మూడు నిమిషాల్లో రెండు గోల్స్...
మార్గావ్ (గోవా): ఓటమి ఖాయం అనుకున్న చోట గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఫార్వర్డ్ ఇగోర్ ఎంజులో అద్భుతం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్లో భాగంగా ఆదివారం ఎఫ్‌సీ గోవా, బెంగళూరు ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు కాగా... మూడో మ్యాచ్ మాత్రం అసలైన ఫుట్‌బాల్ వినోదాన్ని పంచింది. బెంగళూరు ఆటగాళ్లు సిల్వా (27వ నిమిషంలో), ఆంటోనియో గొంజాలెజ్ (57వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. గోవా తరఫున ఇగోర్ (66వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి జట్టును గట్టెక్కించాడు. సునీల్ చెత్రి నాయకత్వంలోని బెంగళూరు తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. హర్మన్జోత్ సింగ్ లాంగ్ త్రోను ముందుకు దూసుకుంటూ వచ్చిన సిల్వా... తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక రెండో అర్ధ భాగంలో ఎరిక్ ఎండెల్ హెడర్‌తో ఇచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచిన ఆంటోనియో బెంగళూరును 2–0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ దశలో బెంగళూరు గెలుపు ఖాయంలా కనిపించింది. అయితే బెంగళూరు విజయావకాశాలను ఇగోర్ దెబ్బ తీశాడు. అల్బెర్టో, జెసురాజ్ ఇచ్చిన పాస్‌లను గోల్స్‌గా మలిచి... మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాడు. నేటి మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీతో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
బెంగళూరు ఎఫ్‌సీ శుభారంభం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ నాలుగో సీజన్లో తొలిసారి బరిలోకి దిగిన బెంగళూరు ఎఫ్‌సీ జట్టు విజయంతో బోణీ చేసింది. బెంగళూరులో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 2–0తో ముంబై ఎఫ్‌సీపై విజయం సాధించింది. బెంగళూరు తరఫున భారత కెప్టెన్ సునీల్ చెత్రి (90వ ని.లో), ఎడువార్డో మార్టిన్ (67వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మరోవైపు చెన్నైలో జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ 3–2తో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. -
గెలిస్తే... మరో చరిత్రే!
ఇరాక్ క్లబ్‌తో బెంగళూరు ఎఫ్‌సీ అమీతుమీ ఏఎఫ్సీ కప్ ఫైనల్ నేడు దోహా: ఆసియాకు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ జట్లు తలపడే ఏఎఫ్సీ కప్‌లో ఓ భారతీయ క్లబ్ బెంగళూరు ఎఫ్‌సీ ఘన చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి ఇప్పటికే రికార్డులకెక్కిన బెంగళూరు ఎఫ్‌సీ ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమైంది. శనివారం ఇరాక్‌కు చెందిన ఎరుుర్ ఫోర్స్ క్లబ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటిదాకా ఈస్ట్ బెంగాల్ క్లబ్ (2013లో), డెంపో (2008లో) సెమీస్ చేరడమే రికార్డరుుతే... దీన్ని సునీల్ చెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఎఫ్‌సీ అధిగమించింది. అరుుతే పటిష్టమైన ఇరాక్ క్లబ్‌ను ఎదుర్కోవాలంటే బెంగళూరు ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఎందుకంటే ఈ జట్టులో జాతీయ జట్టు స్టార్ ఆటగాళ్లు నలుగురు బరిలోకి దిగుతారు. ఈ టోర్నీలో ఎరుుర్‌ఫోర్స్ క్లబ్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలుపొందింది. ఖతార్ స్పోర్ట్స క్లబ్ స్టేడియంలో రాత్రి 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స-1 చానెల్లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.